విషాదం.. ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళపాడు గ్రామానికి చెందిన కర్ణం రాజేందర్‌ అనే ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతిచెందాడు. గత 52 రోజులుగా సమ్మెలో ఉన్న కారణంగా రాజేందర్‌ మనోవేదనకు గురయ్యాడు. తమ ఉద్యోగాలు తిరిగి వస్తాయా, రావా అనే ఆందోళనతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే రాజేందర్ కుటుంబీకులు హుటాహుటినా అతన్ని ఆస్పత్రికి […]

విషాదం.. ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 27, 2019 | 2:14 PM

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళపాడు గ్రామానికి చెందిన కర్ణం రాజేందర్‌ అనే ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతిచెందాడు. గత 52 రోజులుగా సమ్మెలో ఉన్న కారణంగా రాజేందర్‌ మనోవేదనకు గురయ్యాడు. తమ ఉద్యోగాలు తిరిగి వస్తాయా, రావా అనే ఆందోళనతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే రాజేందర్ కుటుంబీకులు హుటాహుటినా అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తెల్లవారుజామున రాజేందర్‌ మృతిచెందాడు. రాజేందర్‌ మృతితో రోడ్డున పడ్డ అతడి భార్యబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.