భారత వాతావరణ శాఖ హెచ్చరిక.. ముంచుకొస్తున్న మరో ముప్పు..

ఇప్పటికే నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఆ ప్రభావం నుంచి కోలుకోక ముందే మరో ఉపద్రవం ముంచుకొస్తుందంటూ..

  • Shiva Prajapati
  • Publish Date - 10:06 pm, Fri, 27 November 20
భారత వాతావరణ శాఖ హెచ్చరిక.. ముంచుకొస్తున్న మరో ముప్పు..

ఇప్పటికే నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఆ ప్రభావం నుంచి కోలుకోక ముందే మరో ఉపద్రవం ముంచుకొస్తుందంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అల్పపీడనం కాస్తా బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఈ ప్రకటనతో బంగాళాఖాతం తీర రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. భారీ వర్షాల కారణంగా ఈ రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం దాదాపుగా స్తంభించిపోయింది. తమిళనాడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఏపీలోనూ పలువురు చనిపోయారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వెయ్యికి పైగా వృక్షాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు మరో తుఫాన్ అంటే ఈ రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు.