Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

హైదరాబాద్‌లో మరో హనీ ట్రాప్..! గాలంకు చిక్కిందెవరంటే..?

Another Honey Trap in Hyderabad, హైదరాబాద్‌లో మరో హనీ ట్రాప్..! గాలంకు చిక్కిందెవరంటే..?

హైదరాబాద్‌లో మరో హనీ ట్రాప్ బాగోతం వెలుగుచూసింది. అందాన్ని ఎరగా వేసి.. పోలీసులకు అడ్డంగా చిక్కింది ఓ కిలాడీ లేడి. మరో హనీట్రాప్‌కు తెరలేపింది. ఓ వ్యాపార వేత్తను తన అందచందాలతో.. వలవేసిన కనిష్క అనే ఎయిర్‌హోస్టెస్.. సదరు వ్యాపార వేత్తతో గడిపన దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. అయితే.. విషయం తెలియని వ్యాపారిని.. ఓ రిసార్ట్‌కు పిలిచారు హనీ కపుల్స్. దీంతో.. రిసార్ట్‌కు వెళ్లిన వ్యాపారికి.. తుపాకి గురిపెట్టారు. భారీగా డబ్బు ఇవ్వాలని.. లేకుంటే ఈ వీడియోలు బయట పెడతానంటూ.. వ్యాపారిని బెదిరించారు.. కిడాడి లేడీ ఆమె భర్త.

భయపడ్డ వ్యాపారి.. 20 లక్షల రూపాయల నగదు.. దాంతో పాటు ఓ కోటి రూపాయల బాండ్ తన పేరు మీద రాయించుకుంది కనిష్క. దీంతో.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపిన పోలీసుల హనీ కపుల్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ భార్యభర్తలిద్దరూ.. గతంలో కూడా.. మరికొందరిని కూడా ట్రాప్ చేసినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో నిజాలు భయపడుతున్నాయి.