‘ఆర్ఆర్ఆర్‌’కు మరో షాక్.. ఆమె కూడా హ్యాండిచ్చిందా..!

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి ఏ ముహూర్తాన ‘ఆర్ఆర్‌ఆర్‌’ను స్టార్ట్ చేశారో కానీ.. ఆ ప్రాజెక్ట్‌కు మంచి టైం నడవడం లేదు. షూటింగ్‌కు కంటిన్యూగా బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ఓ సారి చెర్రీకి, మరోసారి ఎన్టీఆర్‌కు గాయాలు కావడంతో చిత్రీకరణ నిదానంగా నడుస్తూ వచ్చింది. తాజాగా సైరా కోసం మరోసారి చెర్రీ షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్నట్లుగా వార్తలు రాగా.. ఇప్పుడు ఈ మూవీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది.

ఇందులో ఎన్టీఆర్ జోడీగా మొదట బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను రాజమౌళి ఎంపిక చేసుకున్నాడు. అయితే చివరి నిమిషంలో ఆమె కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక ఆ తరువాత ఆమె స్థానంలో హాలీవుడ్ భామ ఎమ్మా రాబర్ట్స్‌ను సెలక్ట్ చేశారని.. జక్కన్న ఆమెతో చర్చలు కూడా జరిపారని త్వరలోనే టీంతో జాయిన్ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎమ్మా కూడా ఆర్ఆర్‌ఆర్‌కు నో చెప్పేసిందట. ఈ సినిమాలో నటించేందుకు ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. బల్క్ డేట్స్ ఇచ్చేందుకు నో చెప్పిందని టాక్. దీంతో ఎన్టీఆర్ జోడీగా మరో భామ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశాడట జక్కన్న. ఇదిలా ఉంటే మరోవైపు వరుసగా ఈ సినిమాకు ఏదో ఒక ఇబ్బంది ఎందుకు రావడంపై ఫ్యాన్స్ తెగ డిసప్పాయింట్ అవుతున్నారు. ఏది ఏమైనా సినిమా అనుకున్న టైంకు రిలీజ్ అవుతే చాలు అని అనుకుంటున్నారట ఫ్యాన్స్. చూడాలి మరి ఏమవుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *