ఏపీలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. కారణం అదేనా..!

వైసీపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల హత్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఓ మహిళ దురుసుగా మాట్లాడిందన్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పండువారి గూడెంకు చెందిన పండు నవీన ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా పై అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రకాశం జిల్లాలో మరో గ్రామ వాలంటీర్లు అసువులు బాసింది. వివరాల్లోకి వెళ్తే.. యర్రగొండపాలెం గ్రామానికి చెందిన షేక్ జుబేద(20)కు ఇటీవలే గ్రామ వాలంటీరు ఉద్యోగం లభించింది. ఈ క్రమంలో తహసీల్దారు కార్యాలయంలో […]

ఏపీలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. కారణం అదేనా..!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 12:18 PM

వైసీపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల హత్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఓ మహిళ దురుసుగా మాట్లాడిందన్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పండువారి గూడెంకు చెందిన పండు నవీన ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా పై అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రకాశం జిల్లాలో మరో గ్రామ వాలంటీర్లు అసువులు బాసింది.

వివరాల్లోకి వెళ్తే.. యర్రగొండపాలెం గ్రామానికి చెందిన షేక్ జుబేద(20)కు ఇటీవలే గ్రామ వాలంటీరు ఉద్యోగం లభించింది. ఈ క్రమంలో తహసీల్దారు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసే గుంటూరి శివప్రసాద్‌చారి శుక్రవారం రాత్రి జుబేద ఇంటికి వచ్చాడు. రికార్డులన్నీ పూర్తి చేసి శనివారం ఉదయానికి కార్యాలయానికి తీసుకురావాలని హెచ్చరించాడు. ఈ సందర్బంగా జుబేద పట్ల శివ ప్రసాద్ చారి అవమానకంగా మాట్లాడాడని.. అందువల్లే తమ కుమార్తె ఉరేసుకుందని మృతురాలి తల్లి కరీమున్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, ఉద్యోగం ఊడిపోతుందని అతను జుబేదతో మాట్లాడారంటూ మృతురాలి తల్లి చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన జుబేద శనివారం ఉదయం స్నానాల గదిలో ఉరేసుకుందన్నారు. ఇదిలా ఉంటే శివప్రసాద్‌చారి ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.