జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్..

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. జీహెచ్ఎంసీకి సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన బ్యాంకులో క్యాషియర్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ అయింది. గడిచిన కొద్ది కాలంగా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు...

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 6:12 PM

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. జీహెచ్ఎంసీకి సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన బ్యాంకులో క్యాషియర్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ అయింది. గడిచిన కొద్ది కాలంగా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాడు క్యాషియర్.  ప్రతి రోజూ వందమందికి పైగా కేసీఆర్ వేతనాలు చెల్లించినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆ బ్లాక్ మొత్తం శానిటైజ్ చేశారు అధికారులు. కాగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరాయి.

కాగా ప్రస్తుతం తెలంగాణాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 879 మందికి పాజిటివ్ వచ్చింది. ముగ్గురు మృతిచెందారు. తాజాగా తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,109 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 3,006 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,217 మందికి నెగెటివ్ రాగా, 879 మందికి పాజిటివ్ వచ్చింది.

Read More: 

పాడైన కరెన్సీ నోట్లను.. ఫ్రీగా ఎస్‌బీఐ‌లో మార్చుకోండిలా..

బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్..

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..