Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

‘మా’లో ముదిరిన వివాదాలు.. అసలు కారణాలు ఇవేనా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో అంతర్గత కలహాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అధ్యక్షుడు నరేష్, జీవితా రాజశేఖర్ వర్గం మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ‘మా’ అధ్యక్షుడు నరేష్ పనితీరుపై, నిధుల విషయంలో ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ వర్గం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నరేష్‌ని కాదని.. వీరిద్దరూ ఈసీ సభ్యులకు సందేశాలు పంపడంతో తీవ్ర దుమారానికి కారణమైంది. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ సమావేశం జరగ్గా.. నరేష్ మినహా మిగిలిన కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యారు.

‘మా’లోని అంతర్గత సమస్యలపై అధ్యక్షుడు నరేష్ స్పందించాలని.. సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్ వివరాలు, నిధుల విషయం గురించి కూడా బహిర్గతం చేయాలనీ జీవిత డిమాండ్ చేశారు. ఇరువర్గాల సభ్యుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నరేష్ తరపు న్యాయవాది మాత్రం అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారని జీవితా రాజశేఖర్‌లను ప్రశ్నించారని సమాచారం. ఇది కేవలం స్నేహపూరితమైన సమావేశమేనంటూ జీవితా రాజశేఖర్‌లు వివరణ ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ హైడ్రామాలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ సమస్యలన్నీ పరిశ్రమ పెద్దల సలహా మేరకు పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు భోగట్టా.

అలా చేస్తే ‘మా’ను డ్యామేజ్ చేసినట్లే – నరేష్

25 ఏళ్ళ చరిత్ర ఉన్న ‘మా’లో ఎప్పుడూ కూడా ఇలాంటి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. 20  రోజుల క్రితం జనరల్ బాడీ మీటింగ్ పెట్టబోతున్నామని.. దానికి మీరు తప్పకుండా రావాలని లెటర్ రాశారు. కానీ ‘మా’లో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాల్సిన బాధ్యత నాదే. నాకు కూడా చెప్పకుండా సడన్‌గా మీటింగ్ ఎందుకు పెట్టారనే అనుమానాలు వచ్చాయి. అంతేకాక నేను నిర్వహించాల్సిన మీటింగ్ వేరొకరు కాల్‌ఫర్ చేయడంతో నన్ను వెళ్లోద్దని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. ఫ్రెండ్లీ సమావేశానికి నేను అక్కర్లేదని అనుకున్నా.. అందుకే ఆ డేట్‌ను ఓ సినిమా షూటింగ్ ఇచ్చాను. నటుడిగా నా ముందు బాధ్యత షూటింగ్ అందుకే మీటింగ్‌కు హాజరు కాలేకపోయాను. ఇక ఆదివారం జరిగిన సమావేశానికి హాజరైన నటుడు, ఎస్వీబీసీ ఛానల్ అధ్యక్షుడు పృథ్వి.. అదొక పనికిరాని మీటింగ్‌గా అభివర్ణించారు. అది చూసినప్పుడు నాకు బాధ కలిగింది. ఒకవేళ అధ్యక్షుడి స్థానంలో నేను ఆ మీటింగ్‌లో కూర్చుని ఉంటే నా పరిస్థితి ఏంటి?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అనే బ్యానర్ పెట్టి.. దాని కింద 550 మందిని పిలిచి మీటింగ్ పెడితే.. పృథ్వి లాంటి నటుడు దాన్ని పనికిరాని సమావేశం అని ఎందుకు అన్నారో ఆలోచించాల్సిన విషయం. అంతేకాకుండా కొన్ని ఫ్లెక్సీల మీద సర్వసభ్య సమావేశం అని ఎందుకు రాశారో అర్థం కాలేదు. మరోవైపు ఈ సమావేశానికి ఓ లాయర్‌ను కూడా పిలిచి.. కాలం మారింది.. దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని కూడా మార్చాలని అన్నారట. ఇక ఆ విషయం తెలిసి షాక్ అయ్యాను.

26 ఏళ్ల క్రితం చిరంజీవి నేతృత్వంలో ప్రారంభమైన ఈ సంస్థకు ఎందరో దిగ్గజాలు అధ్యక్షులుగా పని చేయడం జరిగింది. ‘ మా’లో 93లో చిన్న చిన్న సవరణలు చేసిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల ఈ సంస్థలో … ఏఎన్నార్‌గారు, కృష్ణగారి లాంటి ప్రముఖులు అడ్వైజర్లుగా పనిచేశారు… ఇప్పుడు కృష్ణంరాజుగారు అడ్వైజర్‌గా చేస్తున్నారు. ఇంత మంది పెద్దలుండగా, చర్చలు సవరణలు ఉంటే అందరం కలిసి వాళ్ల దగ్గరకు వెళ్లాలి. వాళ్ల ముందు పెట్టాలి. వాళ్లతో చర్చించి ఓకే అనుకున్నాక మార్పులను ఆహ్వానించాలి. అలా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ‘మా’ను డ్యామేజ్ చేసినట్లే. అంతేకాకుండా ఈ మీటింగ్ అంతా ఎవరో ఇచ్చిన తప్పుడు సూచనతో జరిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై నేను పెద్దలతో కూడా చర్చిస్తున్నాను.

నేను ఎప్పుడూ కూడా ‘మా’ అధ్యక్ష పదవిని పక్కన పెట్టలేదు. అధ్యక్షుడిగా ప్రణాళికను రూపొందించడం, అందరి సహకారంతో ముందుకు వెళ్లడం నా పని.. అదే పని ఇప్పుడూ చేస్తున్నానని ‘మా’ అధ్యక్షుడు నరేష్ స్పష్టం చేశారు.