అసలే పిల్లలకోసం మొక్కని దేవుడు.. తిరగని ఆస్పత్రి లేకపోతే..

ఒక పక్క పిల్లలకోసం మొక్కని దేవుడు, తిరగని ఆస్పత్రి లేక బాధలో ఉన్న దంపతుల్ని నిలువునా దోచేయడమే కొందరి టార్గెట్గా మారిపోయింది. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి బాగోతం బట్టబయలైంది. ఇలాంటి నేరానికి..

అసలే పిల్లలకోసం మొక్కని దేవుడు.. తిరగని ఆస్పత్రి లేకపోతే..
Follow us

|

Updated on: Sep 02, 2020 | 8:31 PM

ఒక పక్క పిల్లలకోసం మొక్కని దేవుడు, తిరగని ఆస్పత్రి లేక బాధలో ఉన్న దంపతుల్ని నిలువునా దోచేయడమే కొందరి టార్గెట్గా మారిపోయింది. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి బాగోతం బట్టబయలైంది. ఇలాంటి నేరానికి సంబంధించి యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం పై మరో కేసు నమోదైంది. సంతానం కోసం కెపిహెచ్ బి కాలనీ లోని బ్రాంచ్ ని సంప్రదించారు సులక్షణ రాణి దంపతులు. అయితే, సదరు ఆస్పత్రివాళ్లు విశాఖపట్నం బ్రాంచ్ లో సరోగసి ద్వారా బిడ్డను ఇస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో దంపతులు విడతల వారిగా 13లక్షల రూపాయలు డా.నమ్రత ఖాతాకి పంపించారు. బిడ్డకోసం ఆస్పత్రి వర్గాలు చెప్పిన తేదీల్లో విశాఖ పట్నం వెళ్లిన దంపతులు షాక్ అయ్యారు. సరోగసి చికిత్స తీసుకుంటున్న తల్లి కోవిడ్ తో మృతి చెందిందని చావు కబురు చల్లగా చెప్పింది సదరు ఆస్పత్రి బ్రాంచి. ఈ వేదనలో ఉన్న క్రమంలో మీడియా లో సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు తిరుమలలో అరెస్ట్ వ్యవహారంపై మీడియా కథనాలు చూశారు సదరు దంపతులు. దీంతో ఆందోళనకు గురైన దంపతులు కొత్తగూడెం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ కి బదిలీ అయింది. అయితే దంపతుల ఆరోపణల్లో నిజమెంత ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.