సిద్ధూకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. అలాంటి సందర్భంలో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నోరు జారారు. పాకిస్థాన్‌పై సానుభూతి చూపించారు. ఇది ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముంబైలోని స్టూడియోలలో సిద్ధూతో పాటు పాకిస్థానీ ఆర్టిస్టులను అనుమతించరాదని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ నిర్ణయించింది. దీని కన్నా ముందు ‘ది కపిల్ శర్మ షో’ నుంచి కూడా సిద్ధూని తప్పించారు. పుల్వామా ఘటన తర్వాత సిద్ధూ మాట్లాడుతూ.. […]

సిద్ధూకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:58 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. అలాంటి సందర్భంలో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నోరు జారారు. పాకిస్థాన్‌పై సానుభూతి చూపించారు. ఇది ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముంబైలోని స్టూడియోలలో సిద్ధూతో పాటు పాకిస్థానీ ఆర్టిస్టులను అనుమతించరాదని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ నిర్ణయించింది. దీని కన్నా ముందు ‘ది కపిల్ శర్మ షో’ నుంచి కూడా సిద్ధూని తప్పించారు. పుల్వామా ఘటన తర్వాత సిద్ధూ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చేసిన పనికి ఒక దేశాన్ని మొత్తాన్ని నిందించడం సరికాదని అన్నారు. అప్పటి నుంచీ సిద్ధూని అంతా విమర్శిస్తున్నారు.