Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజేంద్రనగర్ గ్రే హౌండ్స్ ప్రాంతంలో మళ్లీ చిరుత తిరుగుతూ సిసి కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు. గ్రే హౌండ్స్ కాంపౌండ్ లోపల ఉన్నట్టు గుర్తింపు. 700ఎకరాల్లో పోలీస్ గ్రే హౌండ్స్ . గ్రే హౌండ్స్ ఉన్నతాధికారుల నుండి అనుమతి వచ్చిన తర్వాతే బొన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్న అటవీశాఖ అధికారులు. గ్రే హౌండ్స్ చుట్టూ జూ సిబ్బంది, షూటర్స్, ట్రాప్ కెమెరా లతో అప్రమత్తం.
  • రెండు రాష్ట్రా ప్రభుత్వాలకు ఈనెల 4న జరిగే కృష్ణా నది యజమాన్య బోర్డు మీటింగ్ ఏజెండాలను పంపిన కృష్ణా నీటీ యాజమాన్య బోర్డ్. ఏజెండాలో ప్రధానంగా 5 అంశాల ప్రస్తావన. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టు లు , అభ్యంతరాలు , ప్రాజెక్టుల డీపీఆర్ లు.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • తూ. గో.జిల్లా: కోనసీమలో కరోన కలకలం. కోనసీమను గజ గజ లాడిస్తున్న ..ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు . ఈరోజు ఒక్కరోజులో 28 కరోన పోసిటివ్ కేసులు నమోదు.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

Chiru 152: చిరు సినిమాలో ఛాన్స్.. ఎగిరి గంతేస్తోన్న నటుడు..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రోజుకో ఆసక్తికర వార్త ఫిలింనగర్‌ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓకే చెప్పారట
Another actor got offer in Chiranjeevi movie, Chiru 152: చిరు సినిమాలో ఛాన్స్.. ఎగిరి గంతేస్తోన్న నటుడు..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రోజుకో ఆసక్తికర వార్త ఫిలింనగర్‌ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓకే చెప్పారట. అంతేకాదు 30రోజుల క్యాల్షీట్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్తతో అటు మెగాస్టార్, ఇటు సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాలను ప్రారంభించారు. ఒకప్పుడు కృష్ణ సినిమాలో చిరంజీవి నటించగా.. ఇప్పుడు చిరు మూవీలో మహేష్ బాబు నటించబోతున్నారని వారు సంతోషపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీలో భాగమయ్యారు మరో నటుడు సోనూ సూద్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

Another actor got offer in Chiranjeevi movie, Chiru 152: చిరు సినిమాలో ఛాన్స్.. ఎగిరి గంతేస్తోన్న నటుడు..!

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనూ సూద్.. “చిరంజీవి గారి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నాకు ఎంతో ప్రేమను ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా వారికి మరోసారి నా ప్రేమను ఇస్తానని నమ్ముతున్నా” అని అన్నారు. కాగా సినిమాలోని ఓ కీలక పాత్రలో సోనూ సూద్ నటించబోతున్నారని, ఈ పాత్ర కచ్చితంగా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుందని సమాచారం. ఏదేమైనా చిరు మూవీపై వస్తోన్న వార్తలను చూస్తుంటే.. ఫ్యాన్స్ అంచనాలకు మించి కొరటాల ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా ఈ మూవీలో చిరు సరసన త్రిష నటిస్తోంది. రెజీనా ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: ‘లూసిఫర్’ రీమేక్‌.. లైన్‌లోకి ‘మెగాస్టార్’ ఫేవరెట్ డైరక్టర్..!

Related Tags