సచివాలయంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మొత్తం తొమ్మిది మందికి.!

ఏపీ సచివాలయంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా మరో ఐదుగురు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సచివాలయంలోని ఉద్యోగుల్లో 750 మందికి పరీక్షలు చేయగా,

సచివాలయంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మొత్తం తొమ్మిది మందికి.!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 4:16 PM

ఏపీ సచివాలయంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా మరో ఐదుగురు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సచివాలయంలోని ఉద్యోగుల్లో 750 మందికి పరీక్షలు చేయగా, వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సచివాలయంలో పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అందులో రెవెన్యూ, ఆర్టీజీఎస్‌, మున్సిపల్, అసెంబ్లీ విభాగాల్లో పనిచేసే వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని 1, 2వ బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. అలాగే బ్లాక్‌ 3, అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగుల శాంపిళ్లను తీసుకుంటున్నారు. కాగా సచివాలయంలో ఇదివరకే రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను విధించింది. సచివాలయ ఉద్యోగులు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ని వేసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,588కు చేరింది. అందులో 2323 మంది కోలుకోగా, 73 మంది మరణించారు. ప్రస్తుతం 1192 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 741 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా.. వారిలో 467 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 131 మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. అందులో నలుగురు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4లక్షలకు పైన పరీక్షలు నిర్వహించారు.

Read This Story Also: బస్‌ ఛార్జీల చెల్లింపుల్లో తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..!

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్