అగ్యరాజ్యం అమెరికాలో ఉపాధి కరువు.. నిరుద్యోగ భృతికి 3.8 కోట్ల దరఖాస్తులు

అగ్రరాజ్యం అమెరికాలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలకు కోత పడుతోంది.గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆ దేశ కార్మికశాఖ ప్రకటించింది...

అగ్యరాజ్యం అమెరికాలో ఉపాధి కరువు.. నిరుద్యోగ భృతికి 3.8 కోట్ల దరఖాస్తులు
Follow us

|

Updated on: May 22, 2020 | 2:03 PM

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. కోవిడ్ పంజా దెబ్బకు అమెరికా విలవిల్లాడుతోంది. కరోనా సృష్టించిన సంక్షోభంలో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే కరోనా బాధితులతో పాటు, వైరస్‌ మరణాలతో కంగారెత్తిపోతున్న అమెరికాలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలకు కోత పడుతోంది. గత 2 నెలల్లో సుమారు 39 మిలియన్ల (3.9 కోట్ల) మంది ఉద్యోగాలు కోల్పోయారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

కరోనా మహమ్మారి బారిన పడి అమెరికా కుదేలవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగ రేటు భారీగా పెరుగుతుందని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సేయింట్‌ లూయిస్‌ వెల్లడించింది. కరోనా నేపథ్యంతో నిరుద్యోగం 32.1 శాతానికి పెరుగుతుందని, దీని కారణంగా 4.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోతారని చెప్పింది. లాక్‌డౌన్ ఎత్తివేసినా నిరుద్యోగుల సంఖ్య తగ్గడం లేదు. మే చివరి నాటికి లేదా జూన్‌లో నిరుద్యోగ శాతం 20-25కు పెరిగే ఛాన్స్ ఉందని, దాదాపు 90 ఏళ్ల క్రితం మహా మాంద్యంలో ఇలాంటి పరిస్థితి తలెత్తిందనిఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. ఈ క్రమంలోనే కరోనా సమస్య మొదలైన తర్వాత వరుసగా తొమ్మిదో వారం కూడా లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆ దేశ కార్మికశాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

ఇదిలా ఉంటే, అగ్రరాజ్యం అమెరికాలో ఏ ఉద్యోగిని అకారణంగా తొలగించరు. ఉద్యోగుల తప్పు లేకుండా వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ప్రభుత్వం వారికి ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లిస్తుంది. నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులనేది రాష్ట్రాల వారిగా ఆధారపడి ఉంటుంది. ఒక్కో రాష్ట్రాల్లో ఒక్కో రకంగా దీనిని అమలు చేస్తారు. అయితే ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితుల కారణంగా ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా.. సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా ప్రకటిస్తూ…కొత్త ఆదేశాలిచ్చారు. దీంతో ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో నిరుద్యోగ భృతికి అప్లై చేసుకున్న వారికి సంఖ్య కోట్లల్లో పెరిగిపోతోంది.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..