గల్ఫ్‌లో ఇవాళే ఈద్.. భారత్‌లో రేపు జరిగే అవకాశం

గల్ఫ్ దేశాల్లో సోమవారం రాత్రి నెలవంక కనిపించింది. ఈ విషయాన్ని సౌదీలోని మక్కా మసీదు ఇమామ్ ప్రకటించారు. దీంతో గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతర్, ఇరాన్, ఇరాక్ తదితర గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ఈద్-ఉల్-ఫితర్‌ను ఇవాళ జరుపుకుంటారు. ఇక భారత్‌లో మంగళవారం నెలవంక కనిపించే అవకాశం ఉందని మత పెద్దలు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బుధవారం ఇక్కడ ఈద్ ఉండనుంది. కాగా సాధారణంగా గల్ఫ్ దేశాల్లో ఈద్ జరుపుకున్న మరుసటి రోజు భారత్‌లో ఆ పండుగ జరుపుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *