నెల రోజుల ఉత్కంఠ.. సొంతింటికి చేరుకున్న అన్నెం జ్యోతి..!

అనేక అవాంతరాల మధ్య చివరకు కర్నూల్‌ చేరుకుంది అన్నెం జ్యోతి. హైదరాబాద్ నుంచి ఆమెను కర్నూల్ తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. 15 రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న జ్యోతిని మానేసర్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు అధికారులు

నెల రోజుల ఉత్కంఠ.. సొంతింటికి చేరుకున్న అన్నెం జ్యోతి..!
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2020 | 3:43 PM

అనేక అవాంతరాల మధ్య చివరకు కర్నూల్‌ చేరుకుంది అన్నెం జ్యోతి. హైదరాబాద్ నుంచి ఆమెను కర్నూల్ తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. 15 రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న జ్యోతిని మానేసర్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు అధికారులు. ఆ తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో స్వస్థలానికి పంపించారు అధికారులు. దీంతో శనివారం హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌కు వెళ్లింది జ్యోతి.

అనంతరం జ్యోతి మాట్లాడుతూ.. టీవీ9కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఇంటికి రావడంలో టీవీ9 చాలా కృషి చేసిందని ఆమె ధన్యవాదాలు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా 40 రోజులకు పైగా నరకయాతన అనుభవించానని.. వూహాన్‌లోని నిద్రలేని రాత్రులు గడిపానని ఆమె అన్నారు. కేవలం అన్నం, పచ్చడితోనే కాలం గడిపానని జ్యోతి తెలిపారు. వచ్చే నెల 12న తాను వివాహం చేసుకోబోతున్నట్లు జ్యోతి వివరించారు.

కాగా కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి.. క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం రావడంతో శిక్షణ నిమిత్తం చైనాలోని వూహాన్‌కు వెళ్లింది. ఇంతలోనే అక్కడ కరోనా వైరస్ కలకలం మొదలైంది. దీంతో జ్యోతిని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే విమానం ఎక్కే సమయంలో జ్యోతికి ఫీవర్ ఉండటంతో.. కరోనా వైరస్‌ కేసుగా భావించిన అక్కడి అధికారులు భారత్‌కు రాకుండా అడ్డుకున్నారు. దీంతో జ్యోతి అక్కడే ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తనను ఇండియాకు తీసుకురావాలంటూ జ్యోతి ఫేస్‌బుక్ ద్వారా విఙ్ఞప్తి చేసింది.

మరోవైపు గతేడాదే జ్యోతి నిశ్చితార్ధం జరగ్గా.. ఈ నెల 14, 15న వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. కానీ ఆమె అక్కడే చిక్కుకోవడంతో కుటుంబసభ్యులు అధికారులను సంప్రదించారు. ఏపీకి చెందిన ఎంపీలు, కేంద్రమంత్రుల్ని కలిసిన జ్యోతి కుటుంబసభ్యులు.. ఆమెను వెనక్కు తీసుకోచ్చేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేన నేతృత్వంలో OSD పి. రవిశంకర్ తదితరులు భారత్-చైనా విదేశాంగ శాఖలతో చర్చలు జరిపారు. జ్యోతిని సురక్షితంగా దేశానికి రప్పించడంలో కృషి చేసారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. ఆ ఫ్రూట్‌కు పెరుగుతోన్న భారీ డిమాండ్..!

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ