నేడే అన్నవరం స్వామివారి కళ్యాణోత్సవం

అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసి కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి మండపంలో ఆశీనులను గావించారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. బుధవారం రాత్రి 9 గంటల నుంచి సత్యదేవుడి తిరు కల్యాణ మహోత్సవం జరగనుంది. వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్త ఆగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరిపిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *