ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌‌కు అడుగు దూరంలో అంకిత రైనా.. ఇది గెలిస్తే సరికొత్త రికార్డు

ఆస్ట్రేలియా ఓపెన్ క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్‌కు చేరిన భారత అమ్మాయి అంకిత.. మరో మ్యాచ్ నెగ్గితే గ్రాండ్ స్లామ్ బరిలోకి చేరే ఛాన్స్ ఉంది. ఈ గ్రాండ్‌స్లామ్‌ అర్హత పోటీల్లో..

  • Sanjay Kasula
  • Publish Date - 8:11 am, Wed, 13 January 21
ఆస్ట్రేలియా ఓపెన్  గ్రాండ్‌స్లామ్‌‌కు అడుగు దూరంలో అంకిత రైనా.. ఇది గెలిస్తే సరికొత్త రికార్డు

Woman Player Ankita Raina : ఆస్ట్రేలియా ఓపెన్ క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్‌కు చేరిన భారత అమ్మాయి అంకిత.. మరో మ్యాచ్ నెగ్గితే గ్రాండ్ స్లామ్ బరిలోకి చేరే ఛాన్స్ ఉంది. ఈ గ్రాండ్‌స్లామ్‌ అర్హత పోటీల్లో 118వ ర్యాంకర్‌ ఉక్రెయిన్‌ క్రీడాకారిని కటరినా జవాట్సకపై నెగ్గి క్వాలిఫయర్స్‌ భారత మహిళల టెన్నిస్‌ స్టార్‌ అంకితా రైనా ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు అడుగుదూరంలో ఉంది. మంగళవారం జరిగిన ఈ గ్రాండ్‌స్లామ్‌ అర్హత పోటీల్లో 118వ ర్యాంకర్‌ కటరినా జవాట్సకపై నెగ్గి క్వాలిఫయర్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ రౌండ్‌కు చేరింది. 180వ ర్యాంకర్‌ అంకిత 6-2, 2-6, 6-3తో గెలిచింది. బుధవారం జరగనున్న ఫైనల్‌ రౌండ్లో సెర్బియా స్టార్ ఓల్గా డానిలోవిక్‌‌తో అంకిత తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ 3-6, 2-6తో టుంగ్‌ లిన్‌ చైనీస్‌ తైపీ చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టాడు.

ఇవి కూడా చదవండి :

అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే.. ఈ రిపోర్టు తప్పనిసరి.. విదేశీ రాకపోకలపై త్వరలో కొత్త నిబంధనలు..!

Master Movie: విజయ్‌ ‘మాస్టర్‌’ సన్నివేశాలు లీక్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది.. ఏకంగా థియేటర్‌..