సుప్రీంకోర్టులో అనిల్‌ అంబానీకి చుక్కెదురు

ముకేశ్ అంబానీ సోదరుడు, అడాగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల సంస్థ ఎరిక్‌సన్‌ వివాదంలో భారీ షాక్‌ తగిలింది. కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. ఎరిక్‌సన్‌కు 4 వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ వినీత్‌ సహరన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అలాగే […]

సుప్రీంకోర్టులో అనిల్‌ అంబానీకి చుక్కెదురు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:09 PM

ముకేశ్ అంబానీ సోదరుడు, అడాగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల సంస్థ ఎరిక్‌సన్‌ వివాదంలో భారీ షాక్‌ తగిలింది. కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. ఎరిక్‌సన్‌కు 4 వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ వినీత్‌ సహరన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

అలాగే రిలయన్స్‌ టెలికం చైర్మన్‌ సతీష్‌ సేత్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా‌టెల్‌ చైర్‌పర్సన్‌ ఛాయా విరానీలు రూ.కోటి చొప్పున అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొంది. నాలుగు వారాల్లోపు ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని హెచ్చరించింది. ఎరిక్సన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు.  అనిల్‌ అంబానీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.