ఓటేసిన అనిల్ అంబానీ..కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌

ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీ ముంబై కఫ్పే పెరడ్‌లోని జీడీ సోమని స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి, నవాడా సిట్టింగ్‌ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లకిసరయ్‌ జిల్లా బరహియాలోని బూత్‌ నెం 33లో ఓటు వేశారాయన. ఓటు వేయడానికి ముందు ఆయన బరహియాలోని శక్తిదామ్‌లో పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద […]

ఓటేసిన అనిల్ అంబానీ..కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌
Follow us

|

Updated on: Apr 29, 2019 | 8:04 AM

ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీ ముంబై కఫ్పే పెరడ్‌లోని జీడీ సోమని స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి, నవాడా సిట్టింగ్‌ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లకిసరయ్‌ జిల్లా బరహియాలోని బూత్‌ నెం 33లో ఓటు వేశారాయన. ఓటు వేయడానికి ముందు ఆయన బరహియాలోని శక్తిదామ్‌లో పూజలు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లోని 3 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ నియోజకవర్గంలో రెండో దశ (మొత్తం మూడు దశలు) పోలింగ్‌ జరగనుంది.