రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు బిగ్ షాక్..

Anil Ambani and four Others Resign From Bankrupt Reliance Communications, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు బిగ్ షాక్..

రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్)కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే భారీ నష్టాలతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్ డైరెక్టర్ పదవి నుంచి అనిల్ అంబానీ తప్పుకున్నారు. శనివారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఆయనతో పాటు మరో నలుగురు డైరక్టర్లు విరానీ,రైనా కరణి,మంజరి కాకర్, సురేష్ రంగాచార్ కూడా రాజీనామా చేశారు. వీరందరి రాజీనామా పత్రాలను కంపెనీలోని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పరిశీలనకు కూడా పంపినట్టు తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా సంస్థ భారీ నష్టాలను చవిచూసింది. అదేసమయంలో అప్పులు కూడా పెరిగాయి. దీంతో ఇవన్నీ ఆర్‌కామ్‌ సంస్థను కోలుకోకుండా చేశాయి. బకాయిలు చెల్లించలేక ఆర్‌కామ్ తన మొబైల్ కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేసింది. దీంతో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆర్‌కామ్‌ దివాలా తీసే పరిస్థితులకు దగ్గరైంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ భారీ నష్టాలను మూటగట్టుకుంది. లైసెన్స్ ఫీజులు,స్పెక్ట్రమ్ బకాయిల కేటాయింపుల అనంతరం కంపెనీ నష్టాలు రూ.30,142కోట్లకు చేరుకున్నాయి.

కాగా, వరుసగా దేశీ టెలికాం కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటుండం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే వోడాఫోన్ భారీ నష్టాలను చవిచూస్తోంది. దీంతో ఇక భారత్‌ నుండి వెళ్లిపోడానికి వోడాఫోన్ సంస్థ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *