Breaking News
  • అమరావతి, వాతావరణ సూచనల: రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రంలలో కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రాగల 2 రోజులలో మొత్తం దేశం నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 km ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. తూర్పు మధ్య బంగాళాఖాతం , ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో అక్టోబర్ 29 తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం . ఉత్తర ,దక్షిణ కోస్తాంధ్ర , రాయలసీమ లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం . సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము
  • విజయవాడ: జిల్లా జైలు ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు. పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన ఏపీ జైళ్ల శాఖ డీజీ అహసన్‌ రేజా. ఇప్పటికే ఏపీలో 8 పెట్రోల్‌ బంక్‌లు నిర్వహిస్తున్న జైళ్ల శాఖ. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతో పెట్రోల్‌ బంక్‌ నిర్వహణ.
  • ప్రయాణ కష్టాలు : గరికపాడు చెక్‌పోస్ట్‌ దగ్గర ప్రయాణికుల ఇబ్బందులు . ఏపీ,తెలంగాణ ఆర్టీసీ చర్చల్లో ప్రతిష్టంభన . బస్సు సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు . అరకొరగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు . సొంత వాహనాల్లో నమ్ముకుంటున్న ప్రయాణికులు . ఇద్దరి ముగ్గురి కోసం బస్సులు నడపలేమంటున్న అధికారులు. ఆటోలు, కార్లు, బైక్‌లపై ప్రయాణిస్తున్న ఇరు రాష్ట్రాల ప్రజలు . సరిహద్దుల దగ్గర బ్రేక్‌ డౌన్‌పై ప్రయాణికుల ఆగ్రహం .
  • గీతం యూనివర్సిటీ కట్టడాలు కూల్చివేతపై హైకోర్టు స్టేటస్‌కో. ప్రభుత్వ చర్యలు ఆపాలని హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ . ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను.. అక్రమంగా కూల్చివేస్తున్నారని పిటిషన్‌ వేసిన గీతం యూనివర్సిటీ. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశం. సోమవారం వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని స్టేటస్‌ కో. నేడు హైకోర్టులో కొనసాగుతున్న విచారణ.
  • భద్రాద్రి: చర్ల మండలం చెన్నాపురంలో దారుణం. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరిని గొంతుకోసి చంపిన దుండగులు.
  • హైదరాబాద్‌లో ఎప్పుడూ లేనంత వర్షాలు పడ్డాయి. వర్షాలపై సీఎం ఒక్కసారి కూడా స్పందించకపోవడం బాధాకరం. వర్షాలపై సీఎం కేసీఆర్‌ స్పందించాలి. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి-బీజేపీ నేత మోత్కుపల్లి.
  • ప.గో: ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, శ్రీరాజరాజేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్న కుంకుళ్లమ్మ అమ్మవారు ప.గో: రేపటి నుంచి వచ్చే నెల 2 వరకు ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో నిజ ఆశ్వీజమాస తిరుకల్యాణోత్సవాలు, ఈ నెల 30న ఏకాంతంగా స్వామివారి కల్యాణం, కల్యాణోత్సవాల సమయంలో నిత్యకల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు-ఈవో డి.భ్రమరాంబ.

మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. సైబర్ దాడులు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్‌ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్‌’ పేరుతో ఓ మాల్‌వేర్‌ చలామణిలో ఉందని

Android malware BlackRock, మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. సైబర్ దాడులు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్‌ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్‌’ పేరుతో ఓ మాల్‌వేర్‌ చలామణిలో ఉందని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్‌వేర్‌ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్‌ ఆప్స్‌ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌.ఇన్)‌ హెచ్చరించింది. ఈ ట్రోజన్‌ వైరస్‌ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని సెర్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ మాల్‌వేర్ ఎక్కువగా బ్యాంకింగ్, సామాజిక, కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్, డేటింగ్ యాప్ లపై దాడిచేస్తుంది.  స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడినప్పుడు యాప్‌ డ్రాయర్‌ నుంచి తన ఐకాన్‌ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్‌ అప్‌డేట్‌ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని సెర్ట్ వివరించింది. ఒక్కసారి అనుమతులిస్తే.. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం లాగేస్తుందని సెర్ట్‌ తెలిపింది. అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్‌వేర్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!

 

Related Tags