పేర్లు దొరక్క… ఆండ్రాయిడ్ విలవిల!

Android 10 Will Be the Name of Android Q as Google Stops Using Dessert-Themed Names, పేర్లు దొరక్క… ఆండ్రాయిడ్ విలవిల!

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తినుబండారాల పేర్లు పెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు గూగుల్ రకరకాల పదార్థాల పేర్లు పెడుతూ వచ్చింది. అయితే త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఎలాంటి పేరు పెట్టడం లేదని గూగుల్ ప్రకటించింది.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అదే పేరుతో వ్యవహరించనున్నామని గూగుల్ ప్రకటించింది.ప్రకటించింది. దీంతో ఆండ్రాయిడ్ 10 ఆదే పేరిట ఉంటుంది. ఆండ్రాయిడ్ క్యూ అని పేరు పెట్టడం లేదు కనుక, ఇక తినుబండారం పేరు కూడా దానికి ఉండదు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది యూజర్లు ఆండ్రాయిడ్ ఓఎస్‌లకు ఉన్న తినబండారాల పేర్లను గుర్తు పెట్టుకోవడం కష్టతరమవుతోందని, అందుకనే ఇకపై నూతన ఆండ్రాయిడ్ ఓఎస్‌కు కేవలం ఆండ్రాయిడ్ 10 అనే పేరు మాత్రమే ఉంటుందని గూగుల్ తెలిపింది. ఆ తరువాత వచ్చే ఆండ్రాయిడ్ వెర్షన్లకు కూడా పేర్లు కాక కేవలం నంబర్లు మాత్రమే ఉంటాయని గూగుల్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *