Breaking News
  • నిజామాబాద్‌లో హైఅలర్ట్. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 26 కేసులు. పాజిటివ్‌ వచ్చినవారి బంధువులను గుర్తించే పనిలో అధికారులు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 కేసులు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 144 సెక్షన్‌. పాజిటివ్‌ ప్రాంతాల్లోని వాసులకు హోంక్వారంటైన్‌. రక్త నమూనాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.
  • గుజరాత్: సురేంద్రనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి, మరొకరికి గాయాలు. హైదరాబాద్-70, వరంగల్‌ అర్బన్-19, కరీంనగర్-17 కేసులు. మేడ్చల్-15, రంగారెడ్డి-16, నిజామాబాద్-16, నల్గొండ-9. కామారెడ్డి-8, మహబూబ్‌నగర్-7, గద్వాల-6, సంగారెడ్డి-6. మెదక్-4, భద్రాద్రి-కొత్తగూడెం-4 కేసులు. ములుగు-2, భూపాలపల్లి-1, జనగామ-1 కేసులు నమోదు.
  • రాజస్థాన్: ఈరోజు కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు. మొత్తం 191 కేసులు నమోదు.
  • ఏపీ, తెలంగాణలో రేషన్‌ పరేషాన్. రేషన్‌ షాప్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన జనం. మెజారిటీ షాప్‌ల దగ్గర కనిపంచిన భౌతికదూరం నిబంధన. పంపిణీలో జాప్యంపై నిర్వాహకులతో జనం ఘర్షణ. రంగంలోకి దిగిన పోలీసులు. రేషన్‌ షాప్‌ల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు. కార్డు దారులందరికీ ఉచిత బియ్యం అందిస్తామంటున్న అధికారులు.

ఏపీలో దారుణం..విలేకరిని కత్తులతో నరికి చంపిన దుండగులు

tuni reporter murder, ఏపీలో దారుణం..విలేకరిని కత్తులతో నరికి చంపిన దుండగులు

పీలో ఓ పత్రికా విలేకరి దారుణంగా హత్యకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి అర్బన్ విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణను దుండగులు కిరాతకంగా నరికి చంపారు.  విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన్ను హత్య చేశారు. సత్యనారాయణ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఎస్.అన్నవరం గ్రామ సమీపంలోని లక్ష్మీదేవి చెరువు గట్టుపై విలేకరిని అడ్డగించిన దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సత్యనారాయణ మృతి వార్తతో కుటుంబంలో తీరని విషాదఛాయలు అలముకున్నాయి.

ప్రభుత్వం సీరియస్:

విలేకరి సత్యనారాయణ హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో డీజీపీ సవాంగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్పీని డీజీపీ ఆదేశించారు.

విలేఖరి హత్యను ఖండించిన జనసేనాని:

విలేఖరి మర్డర్‌‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవి చర్యని, ప్రజస్వామాన్యానికి మూలస్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా ఈ ఘటన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఓసారి సత్యనారాయణపై హత్యాయత్నం జరిగిందని.. అది పోలీసుల వరకు వెళ్లినా ఆయనకు రక్షణ కల్పించలేకపోయారని పవన్ పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షించి జర్నలిస్టు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Tags