Andhra Pradesh: టార్గెట్ 175.. రంగంలోకి దిగిన అధినేత జగన్.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశం..

టార్గెట్‌ - 175 దిశగా అడుగులు వేస్తున్నారు వైఎస్ఆర్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు రీజనల్ కో ఆర్డినేటర్లతో..

Andhra Pradesh: టార్గెట్ 175.. రంగంలోకి దిగిన అధినేత జగన్.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశం..
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Sep 28, 2022 | 12:19 PM

టార్గెట్‌ – 175 దిశగా అడుగులు వేస్తున్నారు వైఎస్ఆర్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం మరోసారి భేటీ కాబోతున్నారు. గత రెండు సమావేశాల్లో ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించిన నివేదికలు బయటపెట్టారు సీఎం. లేటెస్ట్‌గా పీకే టీమ్‌ రిపోర్ట్‌ ఇవ్వడం.. కొంతమంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఉండవన్న ప్రచారంతో ఈ భేటీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్‌కి సంబంధించిన రిపోర్ట్‌ని పీకే టీమ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు అందించింది. ఈ నివేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు సీఎం. టోటల్‌గా 175 సీట్లు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఎమ్మెల్యేల పనితీరుపై గడప గడపకు మన ప్రభుత్వంలో అందిన ఫీడ్‌బ్యాక్‌ను సీఎం కొలమానంగా తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. భవిష్యత్‌లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారా? సంక్షేమ పథకాల అమలు.. ప్రభుత్వ ఉద్దేశం ఎంత మేర నెరవేరుతోందన్న అభిప్రాయాలను సీఎం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జీలకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అన్ని స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో అభ్యర్థుల విషయంలో కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగమే ఈ వర్క్‌షాప్‌ అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు