Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు నిజం..

ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. నిన్న రాత్రి అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు నిజం..
Mlc Anantha Babu
Follow us

|

Updated on: May 23, 2022 | 10:49 AM

ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. నిన్న రాత్రి అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాకినాడ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నారాయన. మరికాసేపట్లో అరెస్ట్‌ చూపే అవకాశం ఉంది. పూర్తి వివరాలను డీఐజీ పాలరాజు వెల్లడించనున్నారు. అనంతబాబుతో పాటు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో మరికొందరు పాలుపంచుకున్నట్టు అనుచరులు వెల్లడించారు. సుబ్రహ్మణ్యంను కొట్టిచంపినట్టు విచారణలో అంగీకరించారు.

యస్.. అనంతబాబు రహస్యాలు అన్నీ ఇన్నీ కావు. తవ్వినాకొద్దీ అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే తన మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ హత్య చేశారా? రంగురాళ్ల రహస్యాలు కూడా మర్డర్‌కి మరో రీజనా? అన్న అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమికంగా హత్యేనని నివేదిక సారాంశంగా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్యంను చాలా దారుణంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. తలపై బలంగా మోదారు. చేతులు విరిచేశారు. ప్రైవేట్‌ పార్ట్స్‌పై బలంగా కొట్టారు. గొంతు నొక్కడంతో ఊపిరి ఆగిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. కాగా, సుబ్రహ్మణ్యం హత్య రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది టీడీపీ. మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం బాధిత కుటుంబం స్టేట్‌మెంట్‌ ఆలస్యంగా ఇచ్చిందని ఆరోపించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?