Vidadala Rajini: మిర్చి తోటలో కలియదిరిగిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని.. ఆదుకుంటామంటూ హామీ

YSRCP MLA Vidadala Rajini: వైసీపీ చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని.. తరచూ సాధారణ ప్రజలను కలిసి వారితో ముచ్చటిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె మిర్చి తోటలో

Vidadala Rajini: మిర్చి తోటలో కలియదిరిగిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని.. ఆదుకుంటామంటూ హామీ
Vidadala Rajini
Follow us

|

Updated on: Dec 01, 2021 | 6:36 PM

YSRCP MLA Vidadala Rajini: వైసీపీ చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని.. తరచూ సాధారణ ప్రజలను కలిసి వారితో ముచ్చటిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె మిర్చి తోటలో కలియదిరుగుతూ.. మీడియా కెమెరా కళ్లను ఆకర్షించారు. ఇంతకు ఆమె మిర్చి తోటలను ఎందుకు సందర్శించారో తెలుసుకోవాలంటకే ఈ స్టోరీ చదవండి. ఈ ఏడాది ఏపీలోని మిర్చి పంట‌లకు అంతుచిక్కని తెగుళ్లు సోకి రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని నాదెండ్ల మండలంలోని తూబాడు, చిరుమామిళ్ల గ్రామాల శివార్ల ప‌రిధిలోని మిర్చి పొలాల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రైతులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. తామ‌ర పురుగు ఈ ఏడాది కొత్తగా చేరింద‌ని, పూత‌లోకి ఈ పురుగులు చేరి తినేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తంచేశారు. దీనివ‌ల్ల కాసిన పూత కాసిన‌ట్లు రాలిపోతోంద‌ని వాపోయారు. కాయ‌లు కాయ‌డం లేద‌ని, ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నామ‌ని ఆందోళ‌న వ్యక్తంచేశారు. ఒక్కో ఎక‌రాకు రూ.75వేల నుంచి లక్షకు పైగా న‌ష్టం వాటిల్లుతోంద‌ని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా మిర్చి పంట దెబ్బతిందని పేర్కొన్నారు. కొత్త ర‌కం పురుగులు ఉధృతం అవ‌డం వ‌ల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఈ స‌మ‌స్య ఉందని పేర్కొన్నారు. ఈ క్రాప్ బుకింగ్ అయిన ప్రతి పంట‌కు ఇప్పటికే ప్రభుత్వమే బీమా చెల్లించిందని ఈ విష‌యం అందరికీ తెలిసిందేనన్నారు. రైతులంద‌రికీ వైఎస్సార్ బీమా ద్వారా నష్టపరిహారం ద‌క్కేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన్నారు. కలెక్టర్ తో మాట్లాడి ప‌రిహారం అందేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. ఉద్యాన‌వ‌న శాఖ అధికారులతో మాట్లాడి వెంట‌నే పంట న‌ష్టం అంచ‌నాలు రూపొందించేలా చూస్తాన‌ని రజిని హామీనిచ్చారు.

Mirchi Farmers

Mirchi Farmers

అన్నదాతకు ఎప్పుడు ఏ క‌ష్టం వ‌చ్చినా ఆదుకోవ‌డానికి ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి సిద్ధంగా ఉంటార‌ని తెలిపారు. త‌మది రైతు ప్రభుత్వమని చెప్పుకోవ‌డానికి ఎంతో గర్వపడుతున్నామని ఎమ్మెల్యే రజిని వ్యాఖ్యానించారు. అన్నదాత ఎలాంటి క‌ష్టంలో ఉన్నా.. ఆదుకునే ప్రభుత్వం త‌మ‌ద‌ని ర‌జిని రైతులతో పేర్కొన్నారు.

నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు

Also Read:

Jr.NTR: వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్.. వారి కోసం భారీగా విరాళం..

Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..