రాజమండ్రి ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. మెడికల్ కాలేజీకి రంగం సిద్దం

రాజమండ్రి  ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. మెడికల్ కాలేజీకి రంగం సిద్దం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిందని వై‌సీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. శనివారం మీడయాతో మాట్లాడిన‌ ఎమ్మెల్యే రాజా .. రాజమండ్రిలో గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్ ఏర్పాటుకు మొదటి దశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైద్య కళాశాల నిర్మాణానికి 50 ఎకరాల స్థలం అవసరం అవుతుందని తెలిపారు. రాజమండ్రిలో ప్ర‌జంట్ ఉన్న గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు […]

Ram Naramaneni

|

May 09, 2020 | 5:04 PM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిందని వై‌సీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. శనివారం మీడయాతో మాట్లాడిన‌ ఎమ్మెల్యే రాజా .. రాజమండ్రిలో గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్ ఏర్పాటుకు మొదటి దశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైద్య కళాశాల నిర్మాణానికి 50 ఎకరాల స్థలం అవసరం అవుతుందని తెలిపారు.

రాజమండ్రిలో ప్ర‌జంట్ ఉన్న గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు. రాజమండ్రి గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే మరో 30 ఎకరాల భూసేకరణకు ప్ర‌య‌త్నాలు చేస్తామని రాజా తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు మూడు చోట్ల ప్రభుత్వ భూములు పరిశీలించామన్నారు. రాజమండ్రిలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే లోక‌ల్ గా ఉన్న ప్ర‌జ‌ల‌తో పాటు ఇతర జిల్లాల వారికి కూడా ఎంతో ఉప‌యోగ‌కారిగా ఉంటుందని ఎమ్మెల్యే రాజా అభిప్రాయపడ్డారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu