టిక్కెట్ కన్ఫామ్ విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు కాకుండా, తన భార్య సచీదేవికి టిక్కెట్ ఇస్తారేమోనని కామెంట్ చేశారాయన. ప్రకాశంజిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన. వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని సీఎం జగన్ చెబుతున్నారని, రానున్న ఎన్నికల్లో తనకు కూడా టికెట్ రాకపోవచ్చని, తన సతీమణి సచీదేవికి టికెట్ ఇస్తారేమో అన్నారు. నీకు సీటు లేదు..నీ భార్యకిస్తామని జగన్ అంటే తాను కూడా చేసేది ఏమీ ఉండదని, మహిళలకే ఇస్తామని తేల్చిచెబితే తానైనా పోటీ నుంచి వైదొలగక తప్పదన్నారు బాలినేని. నియోజకవర్గస్థాయి నేతలంతా విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని మాజీ మంత్రి సూచించారు. వైసీపీ కొండెపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయని, పార్టీ గెలుపు కోసం అందరితో నడవాల్సిందేనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో కొండెపి నియోజకవర్గంలో వైసీపీ ఓటమిపాలైంది. ఈసారి మాత్రం అక్కడ కచ్చితంగా గెలిచి తీరడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేసుకుంటూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొండెపిలో కచ్చితంగా గెలవాల్సిందేనని, వైసీపీ జెండా ఎగారల్సిందేనని బాలినేని స్పష్టం చేశారు.
మరోవైపు వైసీపీ చీరాల అభ్యర్థి ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు బాలినేని శ్రీనివాసరెడ్డి . చీరాల నుంచి వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేషేనని శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ ఇటీవల ఎమ్మెల్యే బలరాం, వెంకటేష్‌కు కూడా చెప్పారని బాలినేని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..