Andhra Pradesh: రాజధాని రగడ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం రచ్చ ఇంకా నడుస్తూనే ఉంది. ఏపీలో రాజధాని ఏది? రాష్ట్రానికి రాజధాని ఒకటా? లేక మూడా? ఏది ఫైనల్ చేద్దాం అనే చర్చలు ఒకవైపు,

Andhra Pradesh: రాజధాని రగడ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు..
Dharmana Prasad And Chandra
Follow us

|

Updated on: Oct 03, 2022 | 4:35 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం రచ్చ ఇంకా నడుస్తూనే ఉంది. ఏపీలో రాజధాని ఏది? రాష్ట్రానికి రాజధాని ఒకటా? లేక మూడా? ఏది ఫైనల్ చేద్దాం అనే చర్చలు ఒకవైపు, అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ నిరసనలు మరోవైపు. ఇలా రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే పాలనా వికేంద్రీకరణపై ప్రాంతాల వారీగా డిబేట్ జరుపుతోంది అధికార పార్టీ వైసీపీ. ఇవాళ.. ఇవాళ రాజమహేంద్రవరంలో వికేంద్రీకరణపై కీలక చర్చ జరిగింది. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అయితే, అధికార పార్టీ నేతల వాయిస్ ఎక్కువగా వినిపించింది.

ఈ భేటీలో విపక్ష నేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు వైసీపీ ముఖ్య నేతలు. టీడీపీ పాలనలోనే రాజధాని విషయంలో మోసం జరిగిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాజధాని హైదరాబాద్‌, కర్నూల్‌, చెన్నైలో ఉన్నప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు ధర్మాన. ఉత్తరాంధ్ర గొంతుకోయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. విశాఖ పరిపాలన రాజధాని కావొద్దని చంద్రబాబు చెబితే తాము ఊరుకోవాలా? అని ప్రశ్నించారు.

ఇక ఈ చర్చలో పాల్గొన్న ఎంపీ పిల్లి సుభాశ్‌.. అసలు రాజధానిని ఎక్కడ పెట్టాలనే అధికారం పార్లమెంట్‌దా.. లేదా శాసనసభదా అని ప్రశ్నించారు. దీంట్లో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారని, తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి నష్టం వాటిల్లుతుందనే భయంతోనే ఇలా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అందరూ బాగుండాలి.. అందులో అమరావతి ఉండాలన్నదే సీఎం జగన్‌ ఉద్దేశం అన్నారు ఎమ్మెల్యే కన్నబాబు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!