‘1995 ఎన్నికల ముందే చంద్రబాబు కుట్ర ప్రారంభించారు’.. లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్..

కుట్రలు, కుయుక్తులు 1995 ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు ప్రారంభించారని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి వెల్లడించారు.

'1995 ఎన్నికల ముందే చంద్రబాబు కుట్ర ప్రారంభించారు'.. లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్..
Lakshmi Parvathi
Follow us

|

Updated on: Oct 14, 2022 | 4:51 PM

కుట్రలు, కుయుక్తులు 1995 ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు ప్రారంభించారని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఆరోపించారు. అన్‌స్టాపబుల్ సీజన్-2 వేదికగా బాలకృష్ణ, చంద్రబాబు మధ్య జరిగిన చర్చపై తాజాగా ఆమె ఘాటుగా స్పందించారు. 1995లో జరిగిన పరిణామాలపై చంద్రబాబు మొదటిసారి నోరు విప్పారని ఆమె అన్నారు. 40-50 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు డబ్బులు ఇచ్చినట్లుగా ఆనాడు ఎన్టీఆర్ తనతో చెప్పారని లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు. వేరే పార్టీ పెట్టడానికి చంద్రబాబు.. దాసరి నారాయణరావు, చిరంజీవిని కలిశారని ఆమె ఆరోపించారు. తెలుగుదేశం ఓడిపోతుందని కూడా చంద్రబాబు ఆనాడు ప్రచారం చేయించారన్నారు. తమ పెళ్లితో కూడా పార్టీ ఓడిపోతుందని చంద్రబాబు చెప్పించారని లక్ష్మీపార్వతి అన్నారు.

చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్‌ను చంపేసిందని లక్ష్మీ పార్వతి విమర్శించింది. తానే అధికారం తీసుకోవాలనే లక్ష్యంగా.. ఎన్నికలకు ముందే బాబు కుట్ర చేశారని ఆమె చెప్పారు. నిజంగా పార్టీలో తాను ఇబ్బంది పెట్టి ఉంటే.. ఎన్టీఆర్ ఎందుకు భరిస్తారని ఆమె ప్రశ్నించారు. నల్గొండ,రంగారెడ్డి జిల్లాల్లో ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చారన్న అక్కసుతో.. చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి.. రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ క్రమశిక్షణా చర్యలు కింద ముగ్గురూ లేదా నలుగురి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. 20 మందిని సస్పెండ్ చేశారన్నది అబద్దం అని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. ఇద్దరు వెన్నుపోటుదారులు ఒకరినొకరు సమర్ధించుకున్నట్లు ఉందని.. బాలకృష్ణ, చంద్రబాబుపై ఆమె మండిపడ్డారు.

చంద్రబాబు ఓ దుర్మార్గుడు.. ఇప్పటికీ నిజం చెప్పాలన్న మానవత్వం లేదని లక్ష్మీ పార్వతి తప్పుబట్టారు. బాలయ్య మీద మొదటిసారి పరమ అసహ్యం వచ్చిందని లక్ష్మీ పార్వతి అన్నారు. ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అనిపించింది. ఇప్పటిదాకా బాలకృష్ణను బాగా అభిమానించేదాన్ని, చాలా ఇష్టపడ్డాను. చాలా సాయం చేశానని ఆమె చెప్పారు. ఇప్పుడు ఇద్దరి మాటలను చూస్తుంటే కంపరంగా ఉందని తెలిపారు. బావను కాపాడటానికి బావమరిది రంగంలోకి దిగాడు. ఎన్నికలు వస్తున్నాయి.. సోషల్ మీడియాలో నిజాలు మొత్తం తెలుస్తున్నాయని ఈ షో చేశారని లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలని.. వాళ్లు చేసిన కామెంట్స్‌లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.

కాగా, ఆహా వేదికగా నడుస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్‌లో ఓటీటీ రేటింగులు బద్ధలు కొట్టిన ఈ షో.. రెండవ సీజన్ ఓపెనింగ్ అంతకన్నా అదుర్స్ అనేలా ఉంది. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత అయిన చంద్రబాబుతో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేసింది ఆహా. ఈ షోలో బాలయ్య బాబు.. చంద్రబాబు మధ్య ఫ్యామిలీ మ్యాటర్స్‌తో పాటు.. కంప్లీట్ పొలిటికల్ ఫ్లేవర్ ఉంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి.. నిన్న హెల్త్ వర్సిటీ పేరు మార్పు వరకు అనేక అంశాలపై ఇంట్రస్టింగ్ టాక్ నడిచింది. 1995లో టీడీపీలో జరిగిన కీలక పరిణామాలపై చంద్రబాబు మొదటి సారి నోరు విప్పారు. అంతేకాదు… లోకేష్ కూడా ఈ షోలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!