గుంటూరులో వైఎస్ విగ్రహం ధ్వంసం

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో.. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన గుంటూరులోని కాకుమానులో చోటుచేసుకుంది. వైఎస్ విగ్రహం చేతులు, కాలు భాగంల్లో.. ధ్వంసం చేశారు. ఆలస్యంగా ఈ ఘటన విషయాలు బయటకు వచ్చాయి. కాగా.. కాకుమానులోని చౌరస్తాలో చాలా రోజుల నుంచీ వైఎస్ విగ్రహం ఉంది. విగ్రహ ధ్వంసం.. విషయం తెలుసుకున్న వైసీపీ పార్టీ కార్యకర్తలు చౌరస్తా వద్దే ధర్నాకు […]

  • Publish Date - 11:33 am, Mon, 19 August 19 Edited By:
గుంటూరులో వైఎస్ విగ్రహం ధ్వంసం

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో.. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన గుంటూరులోని కాకుమానులో చోటుచేసుకుంది. వైఎస్ విగ్రహం చేతులు, కాలు భాగంల్లో.. ధ్వంసం చేశారు. ఆలస్యంగా ఈ ఘటన విషయాలు బయటకు వచ్చాయి.

కాగా.. కాకుమానులోని చౌరస్తాలో చాలా రోజుల నుంచీ వైఎస్ విగ్రహం ఉంది. విగ్రహ ధ్వంసం.. విషయం తెలుసుకున్న వైసీపీ పార్టీ కార్యకర్తలు చౌరస్తా వద్దే ధర్నాకు దిగారు. అలాగే.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది స్థానికంగా ఉన్నవారే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దగ్గరలోవున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.