Andhra Pradesh: రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారికి వెంటనే పంపు సెట్లు మంజూరు చేయాలని ఆదేశం

విద్యుత్‌ రంగంపై అధికారులతో సీఎం జగన్‌ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మోటార్లకు మీటర్లపై కీలక కామెంట్స్ చేశారు. వ్యవసాయ మోటార్లపై అధికారులు రైతులకు లేఖలు రాయాలని సీఎం సూచించారు.

Andhra Pradesh: రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారికి వెంటనే పంపు సెట్లు మంజూరు చేయాలని ఆదేశం
Cm Jagan
Follow us

|

Updated on: Jul 28, 2022 | 5:22 PM

CM Jagan: సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ మీటర్లపై రైతులకు లేఖలు రాయాలని సూచించారు. మోటార్లకు మీటర్ల వల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరించాలన్నారు. రైతుపై ఒక్కపైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ ఎలా సక్సెస్ అయ్యిందో వివరించాలని సూచించారు. అక్కడ 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయిన విషయాన్ని రైతులకు తెలియజేయాలని చెప్పారు. మీటర్ల వల్ల మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు అవుతుందో తెలుస్తుందని, నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని చెప్పాలన్నారు. వ్యవసాయ పంపు సెట్ల కోసం అర్జీ పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు సీఎం జగన్‌.  ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే వెంటనే రీప్లేస్‌ చేయాలని స్పష్టం చేశారు.

విద్యుత్‌ శాఖపై సమీక్ష చేశారు సీఎం జగన్‌. థర్మల్‌ కేంద్రాల దగ్గర సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉండే రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలన్నారు. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా జాగ్రత్తపడాలని స్పష్టం చేశారు. APMDC నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి