Andhra Pradesh: ప్రజలను చంద్రబాబే రెచ్చగొడుతున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్

Andhra Pradesh: ప్రజలను చంద్రబాబే రెచ్చగొడుతున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్
Srikanth Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా తన సభలకు జనం రాక, ఆఖరికి చిన్నపిల్లలతో....

Ganesh Mudavath

|

May 13, 2022 | 1:25 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా తన సభలకు జనం రాక, ఆఖరికి చిన్నపిల్లలతో “జై తెలుగుదేశం.. సీఎం బాబు..” అంటూ నినాదాలు చేయించుకునే స్థాయికి చంద్రబాబు దిగజారారని విమర్శించారు. 40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారన్నారు. ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతూ.. రాష్ట్రంలో విద్వేషాలు కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న అత్యాచారాలు, నేరాలకు టీడీపీ(TDP)కి చెందిన వారే కారణమని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేస్తే ఆయనను చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని ఆక్షేపించారు. విజయవాడ(Vijayawada) రమేష్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కారణంగా.. 16 మంది మరణిస్తే ఆ ఘటననూ చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, గంట, రెండు గంటల లోపే అరెస్టులు చేసి, నిందితులను జైళ్ళల్లో పెడుతున్నామన్నారు. రాజకీయాల్లో అనుభవం పెరిగేకొద్దీ హుందాతనం కూడా పెంచుకోవాలని సూచించారు. కానీ, చంద్రబాబునాయుడుకి అనుభవం, వయసు పెరిగే కొద్దీ ఇంకా ఇంకా దిగజారిపోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గడపగడపకూ చేరుతున్నాయి. దీంతో ఇక తన పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే బాధ, భయంతో చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. జగన్ పాలనలో కులం, మతం, పార్టీ, జెండాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా క్యాలెండర్ ఏర్పాటు చేసి మరీ ప్రతి పథకాన్ని, ప్రజల గడప వద్దకే వెళ్లి అందిస్తున్నాం. చంద్రబాబు అధికారంలో ఉండగా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, సచివాలయ వ్యవస్థ, నాడు-నేడు, స్కూళ్లు, ఆసుపత్రుల అభివృద్ధి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్ లు ఉన్నాయి. ఇదంతా అభివృద్ధిగాక మరేమిటి.?

– గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే

గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రంలో ఓ పండుగలా జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దళారులు లేకుండా, ఒక్క పైసా లంచం లేకుండా పూర్తి పారదర్శకంగా నేడు పరిపాలన జరుగుతుందని చెప్పారు. 35 నెలల వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పేందుకు వెళ్తుంటే దానిపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. అదే చంద్రబాబు హయాంలో ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తే పంచాయతీలు చేసి పంపించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలనకు, జగన్ పాలనకు ఎంత తేడా ఉందో ప్రజలు ఈ రోజు గమనిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

7 సార్లు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచినా, మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా, కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయలేకపోయారని, మీ నాయకత్వ సమర్థత ఏమిటో ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో వచ్చిన భయంతోనే చంద్రబాబు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

విశాఖ పెళ్లి కూతురు సృజన మృతి కేసులో మరో ట్విస్ట్ .. బ్యాగులో గన్నేరు పప్పు.. అదే కారణమా..?

ఇవి కూడా చదవండి

BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు..రూ.50000ల జీతం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu