సోషల్‌ మీడియాలో ఎంత క్రేజ్‌ ఉన్నా.. అది అక్కడ పనికి రాదు..

వైసీపీ యువనాయకుడు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలన్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తే...

  • Tv9 Telugu
  • Publish Date - 8:23 pm, Mon, 2 March 20
సోషల్‌ మీడియాలో ఎంత క్రేజ్‌ ఉన్నా.. అది అక్కడ పనికి రాదు..

వైసీపీ యువనాయకుడు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలన్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తే పదవులు, అధికారం అవసరంలేదన్నారు. ఇక మంత్రి అనిల్‌ను విమర్శించిన వారెవరూ వైసీపీ కార్యకర్తలు కాదన్నారు. వైసీపీవారు అయితే తాను సమాధానం చెబుతానన్నారు. ఇటీవల వైసీపీ కార్యకర్తలు మంత్రి అనిల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ఈ విధంగా స్పందించారు. ఇక సోషల్‌ మీడియాలో ఎంత క్రేజ్‌ ఉన్నా అది రాజకీయాల్లో పనికి రాదన్నారు. ప్రజా సేవ చేస్తేనే.. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుందన్నారు.