మోసం చేసి.. పెళ్లంటే మొహం చాటేశాడు..

విజయవాడ: ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. అన్ని రకాలుగా వంచించాడని.. కానీ.. పెళ్లి చేసుకోమంటే మాత్రం మొహం చాటేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిన్నరాత్రి నుంచి ఆమె ధర్నా కొసాగిస్తోంది. కానీ ఆమె ప్రియుడు నుంచి కానీ, కుటుంబం నుంచి కానీ ఎలాంటి స్పందనా రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ.. ఆమె ప్రియుడి ఇంటి ముందే బైఠాయించింది. ఇబ్రహీంపట్నంలోని […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:44 am, Tue, 16 April 19
మోసం చేసి.. పెళ్లంటే మొహం చాటేశాడు..

విజయవాడ: ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. అన్ని రకాలుగా వంచించాడని.. కానీ.. పెళ్లి చేసుకోమంటే మాత్రం మొహం చాటేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిన్నరాత్రి నుంచి ఆమె ధర్నా కొసాగిస్తోంది. కానీ ఆమె ప్రియుడు నుంచి కానీ, కుటుంబం నుంచి కానీ ఎలాంటి స్పందనా రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ.. ఆమె ప్రియుడి ఇంటి ముందే బైఠాయించింది.

ఇబ్రహీంపట్నంలోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ల జోసఫ్ అనే యువకుడు, అదే ఏరియాకు చెందిన భాగ్యలక్ష్మీ అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ఆర్థికంగా, శారీరకంగా తనను వాడుకుని మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ. న్యాయం కావాలంటూ నిన్న రాత్రి నుంచి జోసేఫ్ ఇంటి దగ్గరే ధర్నా చేస్తోంది. జోసేఫ్ తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని.. తెగేసి చెబుతోంది. ఆమెకు మద్దతుగా నిలిచిన మహిళా సంఘాలు కూడా జోసఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.