వాటిని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా : ఎమ్మెల్యే ఆర్కే

సీఆర్డీఏ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. కరకట్టను ఆధారంగా చేసుకుని ఆయన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఓ అడుగుముందుకేసి .. ఎమ్మెల్యే ఆర్కే భారీ వసూళ్లకు పాల్పడ్డారనికూడా ఆరోపించారు. ఈనేపధ్యంలో సీఆర్డీఏ ఛైర్మన్ ఆళ్ల స్పందిస్తూ.. తనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దివంగత […]

వాటిని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా : ఎమ్మెల్యే ఆర్కే
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Jul 08, 2019 | 7:34 PM

సీఆర్డీఏ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. కరకట్టను ఆధారంగా చేసుకుని ఆయన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఓ అడుగుముందుకేసి .. ఎమ్మెల్యే ఆర్కే భారీ వసూళ్లకు పాల్పడ్డారనికూడా ఆరోపించారు. ఈనేపధ్యంలో సీఆర్డీఏ ఛైర్మన్ ఆళ్ల స్పందిస్తూ.. తనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై వృద్ధులు, వితంతువులు పెన్షన్ల కోసం ఎవరివద్దకు వెళ్లనవసరం లేదన్నారు.. అక్టోబర్ 2 నుంచి ఇకపై వారి ఇంటికే వచ్చి వాటిని అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu