Murder in Visakha: విశాఖపట్నంలో దారుణం.. భర్తపై అనుమానం.. రోకలిబండతో కొట్టి చంపిన భార్య..

Murder in Visakha: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలను చంపేస్తాడేమో అని అనుమానంతో చివరికి భర్తనే..

Murder in Visakha: విశాఖపట్నంలో దారుణం.. భర్తపై అనుమానం.. రోకలిబండతో కొట్టి చంపిన భార్య..
Crime News
Follow us

|

Updated on: Mar 19, 2021 | 4:30 PM

Murder in Visakha: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలను చంపేస్తాడేమో అని అనుమానంతో చివరికి భర్తనే అంతమొందించింది భార్య. ఈ ఘటన విశాఖపట్నంలోని చంగలరావు పేట ద్వారా వారి వీధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగలరావుపేట ద్వారం వారి వీధిలో పుండరీకాక్షయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి మధ్య గత కొంత కాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణ నేపథ్యంలోనే భర్త పుండరీకాక్ష్యయ్య పిల్లలను చంపేస్తాడేమో అని అనుమానించిన భార్య.. తీవ్ర భయబ్రాంతులకు గురైంది. ఈ క్రమంలోనే భర్తను రోకలిబండతో తలపై బలంగా కొట్టింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పుండరీకాక్షయ్య.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికులు పోలీసులకు ఈ విషయాన్ని చేరవేయడంతో పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక భర్తను చంపిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

Also read:

Telangana MLC Election Results 2021 LIVE: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మూడో రోజు ఓట్ల లెక్కింపు

Chandrababu Naidu Grandson Birthday: తిరుమలకు చంద్రబాబు.. దేవాన్ష్ బర్త్‌డే రోజు తిరుమలేశుడికి భారీ కానుకలు

బాన్సువాడ నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన స్పీకర్‌ పోచారం.. మందిరానికి పోచారం రూ.లక్ష విరాళం