అనుమానంతో అమానుషం.. విద్యుత్ తీగలు చుట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆరేళ్ల కుమారుడినీ మట్టుబెట్టేందుకు ప్రణాళికలు రచించాడు. దీంతో భార్యా, కుమారుడితో

అనుమానంతో అమానుషం.. విద్యుత్ తీగలు చుట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి
Harassment
Follow us

|

Updated on: Feb 22, 2022 | 7:26 AM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆరేళ్ల కుమారుడినీ మట్టుబెట్టేందుకు ప్రణాళికలు రచించాడు. దీంతో భార్యా, కుమారుడితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్యను తీవ్రంగా కొట్టి గాయపరిచిన భర్త.. కుమారుడిని గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అంతే కాకుండా వారి శరీరాలకు విద్యుత్ తీగలు చుట్టి, కరెంట్ షాక్ ఇచ్చాడు. బాధితుల కేకలు విన్న స్థానికులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా దర్శి(Darshi) లో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. పొదిలి మండలంలోని సూదనగుంట రామాపురం గ్రామానికి చెందిన దేశం రమణారెడ్డికి.. దొనకొండ మండలం నారసింహనాయునిపల్లికి చెందిన కెజియాతో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కుమారుడు రేవంత్‌ ఉన్నాడు. రమణారెడ్డి సినిమా థియేటర్ ను లీజుకు తీసుకుని నిర్వహిస్తుంటాడు.

రమణారెడ్డికి తన భార్య కెజియాపై అనుమానం ఏర్పడింది. తరచూ ఆమెను దూషిస్తూ కొట్టేవాడు. ఇరువురి మధ్య గొడవలు తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి.. రమణారెడ్డి తన భార్య, కుమారిడిని తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. కుమారుడి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఇద్దరి శరీరాలకు తీగలు చుట్టి విద్యుదాఘాతం ద్వారా మట్టుబెట్టేందుకు యత్నించాడు. ఈ ఘటనలో రేవంత్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విని.. నిద్ర లేచిన ఇంటి యజమాని అక్కడికి చేరుకోవడంతో రమణారెడ్డి పరారయ్యాడు. బాధితులను దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. కెజియా ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Also Read

Stand Up Rahul : రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్ నుంచి క్రేజీ సాంగ్ ను రిలీజ్ చేసిన నితిన్

Gold Silver Price Today: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Viral Photo: బోసినవ్వుల ఈ పాపాయి ఇప్పుడు టాలీవుడ్‏లో టాప్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..