అరగంట వ్యవధిలో ఆ దంపతులు అనంతలోకాలకు.. ఇద్దరూ గుండెపోటుతోనే.. అసలు ఏం జరిగిందంటే..?

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్యభర్తలు అరగంట వ్యవధిలో మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... ఎస్ కోట మండలం పందిరప్పన్న జంక్షన్ వద్ద...

  • Ram Naramaneni
  • Publish Date - 11:29 am, Sun, 24 January 21
అరగంట వ్యవధిలో ఆ దంపతులు అనంతలోకాలకు.. ఇద్దరూ గుండెపోటుతోనే.. అసలు ఏం జరిగిందంటే..?

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్యభర్తలు అరగంట వ్యవధిలో మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే… ఎస్ కోట మండలం పందిరప్పన్న జంక్షన్ వద్ద అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సూర్యప్రభ అనే మహిళ బాత్రూమ్‌లో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందింది. బాత్రూమ్‌కి అని చెప్పి లోపలికి వెళ్లిన ఆమె.. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో భర్త మనోహర్ వెళ్లి చూశాడు. అక్కడ భార్య విగతజీవిగా కనిపించడంతో తట్టుకోలేకపోయిన భర్త కూడా గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందాడు. అరగంట వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు మృతిచెందటం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.

ఎల్‌ఐసిలో ఉద్యోగిగా పనిచేస్తున్న అద్దంకి మనోహర్, భార్య సూర్యప్రభ  గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూ, సహాయసహకారాలు అందిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు లికిత్ అనే ఒక కుమారుడు ఉన్నారు. అమ్మానాన్నల అనూహ్య మరణంగా అతడు అనాధగా మారాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తెలంగాణ కరోనా రౌండప్ : రాష్ట్రంలో కొత్తగా 197 పాజిటివ్ కేసులు.. రేపట్నుంచి ప్రవేట్ హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్

India Corona Cases: దేశంలో కొత్తగా 14,849 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా..