AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains in Vijayawada: విజయవాడలో వర్షం బీభత్సం.. విరిగిపడుతున్న కొండ చరియలు.. నదులను తలపిస్తున్న రహదారులు

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పై కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుండి భారీ కొండ రాళ్లు జారి కింద పడ్డాయి. అయితే వర్షాల నేపధ్యంలో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ముందుగా ఘాట్ రోడ్ ను మూసి వేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. డోనార్స్ లంజ్ తో పాటు ప్రోటోకాల్ రూమ్ పై కొండ చరియలు విరిగి పడ్డాయి. కొండపైన ఉన్న సమాచార కేంద్రం కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలో గుడిపైకి భక్తులు వెళ్లకుండా సిబ్బంది రాకపోకల్ని నిలిపివేశారు.

Rains in Vijayawada: విజయవాడలో వర్షం బీభత్సం.. విరిగిపడుతున్న కొండ చరియలు.. నదులను తలపిస్తున్న రహదారులు
Vijayawada Rains
Surya Kala
|

Updated on: Aug 31, 2024 | 5:30 PM

Share

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జన జీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. విజయవాడలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పై కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుండి భారీ కొండ రాళ్లు జారి కింద పడ్డాయి. అయితే వర్షాల నేపధ్యంలో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ముందుగా ఘాట్ రోడ్ ను మూసి వేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. డోనార్స్ లంజ్ తో పాటు ప్రోటోకాల్ రూమ్ పై కొండ చరియలు విరిగి పడ్డాయి. కొండపైన ఉన్న సమాచార కేంద్రం కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలో గుడిపైకి భక్తులు వెళ్లకుండా సిబ్బంది రాకపోకల్ని నిలిపివేశారు.

రూ. 5 లక్షల పరిహారం

అయితే ఇంద్రకీలాది కొండకు మరో వైపు విరిగిపడిన కొండ చరియలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో మొఘల్ రాజ్ పురం వంటి ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. అప్రమత్తమైన అధికారులు కొండ చరియలు విరిగి పడే ప్రాంతంలోని ఇళ్ళను ఖాళీ చేయిస్తున్నారు. ఇలా సహాయక చర్యలు జరుగుతుండగానే మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. సిఎం చంద్ర బాబు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరో మూడు రోజులు వర్షాలు

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరించిన నేపధ్యంలో ముఖ్య మంత్రి చంద్రబాబు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అధికారులు చెప్పే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

వాహనాలు దారి మల్లింపు

విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులు, పోలేసులు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. VVIP లతో సహా ద్విచక్ర వాహన దారులు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రొడ్లలోకి వాహనాలను మళ్ళించారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మల్లించాలని సూచించారు. ఇప్పటికే పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అంతే కాదు బెంజ్ సర్కిల్ వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.]

నిలిచిపోయిన వాహనాలు

నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీళ్ళుతో నిండిపోయాయి. దీంతో ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని సూచనలు చేశారు. బెంజ్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ఎంజీ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన కూడళ్లలో ఫైర్ ఇంజన్ లతో నీళ్ళు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. పాతబస్తీలో ఔట్ ఫాల్ డ్రెయిన్ పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..