Andhra Pradesh vs Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్.. కేఆర్ఎంబీకు మళ్లీ లేఖ రాసిన ఏపీ సర్కార్.. కారణమేంటంటే..

Andhra Pradesh vs Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్.. కేఆర్ఎంబీకు మళ్లీ లేఖ రాసిన ఏపీ సర్కార్.. కారణమేంటంటే..
Krmb Grmb

AP-TS Water Disputes: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ వాటర్ వార్ మొదలైంది. నీటి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది.

Shiva Prajapati

|

Aug 19, 2021 | 8:38 AM

AP-TS Water Disputes: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ వాటర్ వార్ మొదలైంది. నీటి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ ఉత్పత్తిని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీకి ఆంధ్రప్రదేవ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేమని ఈఎన్‌సీ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కిందికి వదులున్న నీటిని నాగార్జున సాగర్‌లో నిలిపే అవకాశం లేదని, సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనకు వాడుతున్న నీరంతా సముద్రంలో వృధాగా కలిసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే.. తెలంగాణ విద్యుత్ ఉత్పాదన వల్ల వృధా అవుతున్న నీటిని వారికి కేటాయించిన కోటా నుంచి మినహాయించాలని కేఆర్ఎంబీని ఏపీ సర్కార్ డిమాండ్ చేసింది. లేదంటే విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే ఆపాలని కేఆర్ఎంబీని కోరింది.

కాగా, ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండగా మారింది. దాంతో ఎడమ గట్టున ఉన్న విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేయాలని టీఎస్‌ జెన్‌కోని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు టీఎస్ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్స్ నిర్మిస్తోందంటూ కృష్ణా రివర్ బోర్డ్ యాజమాన్యానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్, కేంద్ర జల వనరుల శాఖ అనుమతి లేకుండానే ప్రాజెక్ట్స్‌ నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరింత పెంచి.. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు తాగు, సాగు నీరు అందించాలని ఏపీ ప్రభుత్వం యోచించింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కార్.. అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలంటూ కేఆర్ఎంబీని కోరింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో స్పందించిన కేఆర్ఎంబీ.. డీఎం రాయపూరే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం.. రాయలసీమ ప్రాజెక్టులను పరిశీలించింది. ఈ మేరకు నివేదిక రూపొందింది.

Also read:

బ్యాంక్ కస్టమర్లకు గుడ్‏న్యూస్.. బంపర్ ఆఫర్లను ప్రకటించిన పీఎన్బీ.. వారికి మాత్రమే బెనిఫిట్..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర.. రెండో రోజు షెడ్యూల్ వివరాలు ఇవే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu