Andhra News: తిరుపతి “జూ” కు వాలాబీ దూరం.. మృతి చెందిన అరుదైన జంతువు
తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలో వాలబీ మృతి చెందింది. శ్రీ వెంకటేశ్వర ఎర్రమెడ గల మగ వాలబీని కోల్పోయినట్లు ఎస్వీ జూ అధికారులు ప్రకటించింది. గత రెండ్రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడిన వాలబీ.. ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్‌మార్టం పూర్తైన తర్వాత స్.వి జూలాజికల్ పార్క్‌లోని పోస్ట్‌మార్టం కాంప్లెక్స్‌లో వాలబీని ఖననం చేశారు

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలో వాలబీ మృతి చెందింది. అక్టోబర్ 30 ఉదయం నుండి వాలబీ జంతువు అనారోగ్యంతో ఆహారం తీసుకోకపోవడాన్ని జూ అధికారులు గమనించారు. పశువైద్య బృందం వెంటనే ఇంటెన్సివ్ కేర్‌ను ప్రారంభించి మందులు అందించింది. నిరంతర ప్రయత్నం పర్యవేక్షణ ఉన్నప్పటికీ, వాలబీ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆ జంతువు తీవ్ర అనారోగ్యాన్ని ఎదుర్కొంది. కార్డియోపల్మోనరీ రిససిటేషన్ సీపీఆర్ తో సహా అత్యవసర సేవలు అందించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది.

ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం, మృతదేహాన్నిపోస్ట్‌మార్టం పరీక్ష కోసం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలోని పాథాలజీ విభాగానికి తరలించారు. మరణానికి కారణం టాక్సోప్లాస్మోసిస్ అని నిర్ధారించిన డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించారు. పరీక్ష అనంతరం మృతదేహాన్ని తిరుపతి ఎస్.వి జూలాజికల్ పార్క్‌లోని పోస్ట్‌మార్టం కాంప్లెక్స్‌లో ఖననం చేశారు.
గుజరాత్‌కు చెందిన రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ 2025 ఆగస్టు 27న ఒక జత మీర్‌కాట్స్‌తో పాటు ఒక జత కామన్ మార్మోసెట్స్, ఒక జత ఎర్ర మెడ గల వాలబీస్‌ను విరాళంగా ఇచ్చింది. ఈ జంతువులను పార్క్‌లోని ప్రత్యేకంగా సంజీవని బ్లాక్‌లో ఉంచారు. ఈ జంతువులన్నీ క్వారంటైన్ వ్యవధిలో ఉండగా వాలాజీ మృతి పట్ల జూ పార్క్ యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
