Disha App: దిశ యాప్ డౌన్ లోడ్‌ చేసుకోండి.. ఫ్రీ బస్ జర్నీ కొట్టేయండి.. సరికొత్తగా ప్లాన్ చేసిన విజయనగరం ఎస్పీ దీపిక

ఏపీ ఎక్స్ క్లూజివ్ లేడీ ప్రొటెక్షన్ యాప్.. దిశ యాప్.. ఇటీవల రమ్య ఉదంతం తర్వాత దిశ యాప్ ఆవశ్యకత మరింత పెరిగిందని భావించిన పోలీసులు.. ఈ యాప్ పై మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు.

Disha App: దిశ యాప్ డౌన్ లోడ్‌ చేసుకోండి.. ఫ్రీ బస్ జర్నీ కొట్టేయండి.. సరికొత్తగా ప్లాన్ చేసిన విజయనగరం ఎస్పీ దీపిక
Sp Deepika Patil
Follow us

|

Updated on: Aug 20, 2021 | 9:32 AM

ఏపీ ఎక్స్ క్లూజివ్ లేడీ ప్రొటెక్షన్ యాప్.. దిశ యాప్.. ఇటీవల రమ్య ఉదంతం తర్వాత దిశ యాప్ ఆవశ్యకత మరింత పెరిగిందని భావించిన పోలీసులు.. ఈ యాప్ పై మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికి ఫ్రీ బస్ జర్నీ ఆఫరిస్తూ.. దిశ యాప్ డౌన్ లోడ్ స్పీడ్ పెంచే యత్నం చేశారు.

దిశయాప్ వాడకంపై అవగాహన పెంచేందుకు తానే స్వయంగా తన కొడుకుతో కలసి బస్సు ఎక్కి.. ఆడపిల్లల్లో మరింత ఉత్సాహం నింపారు. అంతే కాదు వారితో మాటా మంతీ కలిపి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ కోసం ఐడియాలను అడిగి తెలుసుకున్నారు. మహిళ్ల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కల్పిస్తూ.. వాటికి నివారణోపాయాలను వివరించారు. సోషల్ మీడియాకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలని సూచించారు ఎస్పీ దీపికా పాటిల్.

ఇటీవల జిల్లాకు వచ్చిన ఎస్పీ దీపికా పాటిల్.. మహిళా భద్రతను సీరియస్ గా తీసుకున్నట్టు చెప్పారు. దిశ యాప్ వాడకంపై విస్తృత ప్రచారం చేస్తున్నామని అన్నారు. గత ఇరవై రోజుల్లో మూడు లక్షల ముప్పై వేల మంది మహిళల మొబైల్స్ లో దిశ యాప్ డౌన్ లోడ్ చేయించి ఆపదలో ఉన్నప్పుడు ఎస్వోఎస్ కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం ఎలా.. అన్న అంశంపై అవగాహన కల్పించారు.

దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న మహిళలు, విద్యార్ధినులు తమ మొబైల్ చూపితే చాలు.. ఉచిత బస్సు ప్రయాణం చేసేలా అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా దీపికా పాటిల్ పోలీసుల ఉచిత బస్సు లో ప్రయాణించారు. ఎస్పీ దీపికా పాటిల్ చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

జిల్లా మహిళా లోకం ఎస్పీ దీపికపై ప్రశంసలతో ముంచెత్తారు. జిల్లాలో ప్రతి మహిళ మొబైల్లో దిశ యాప్ ఉండటమే తన లక్ష్యమంటున్నారు ఎస్పీ దీపిక. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అనిల్ తో పాటు పలువురు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: తాలిబన్లకు ఆ ప్రదేశం అంటే వణుకు.. కనీసం కన్నువేయడానికి కూడా వణికిపోతుంటారు.. ఎందుకో తెలుసా..

నల్లబంగారం ఎలా తయారు చేస్తారు.. గుర్తిపు పత్రం నుండి మార్కెట్ వరకు ప్రతిదీ తెలుసుకోండి..

Success Story: అబద్దం కాదు.. ఇది నిజం.. ముత్యాల సాగుతో లక్షలు ఆర్జిస్తున్న రైతు సంజయ్.. ఎక్కడో తెలుసా..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?