వైఎస్ వివేకా హత్య కేసు.. మరోమారు మున్నాను ప్రశ్నించనున్న సీబీఐ

మాజీ మంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది

  • Tv9 Telugu
  • Publish Date - 8:24 am, Fri, 25 September 20
వైఎస్ వివేకా హత్య కేసు.. మరోమారు మున్నాను ప్రశ్నించనున్న సీబీఐ

YS Viveka murder case: మాజీ మంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది.  ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్ కేంద్రంగా విచారణ కొనసాగుతోంది. గురువారం సుదీర్ఘంగా 8 గంటల పాటు చెప్పుల యజమాని మున్నాను ప్రశ్నించిన అధికారులు.. ఇవాళ మరోమారు ఆయనను ప్రశ్నించనున్నారు. మున్నాతో పాటు పులివెందులకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్య , నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, చంటి (హిజ్రా) మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు ప్రశ్నించారు.

వారు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసుకున్నారు. మరోవైపు మున్నా స్నేహితులను కూడా పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ పుల్లయ్యని దాదాపు 7 గంటలకుపైగా ప్రశ్నించారు. మున్నాకి, పుల్లయ్యకి ఎలా పరిచయం జరిగింది..? ఎన్ని రోజులుగా వీరిద్దరి మధ్య సంబంధం ఉంది..? అన్న కోణంలో సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

Read More:

Bigg Boss 4: ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్‌ చేసిన బిగ్‌బాస్‌

Bigg Boss 4: మోనాల్‌కి దూరంగా.. హారికకు దగ్గరగా.. హౌజ్‌లో మరో లవ్‌స్టోరీ