వివేకా హత్య కేసు విచారణకు తాత్కాలిక బ్రేక్‌

మాజీ మంత్రి, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారుల్లో

  • Tv9 Telugu
  • Publish Date - 3:50 pm, Tue, 6 October 20
వివేకా హత్య కేసు విచారణకు తాత్కాలిక బ్రేక్‌

YS Viveka Murder Case: మాజీ మంత్రి, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారుల్లో ఇప్పటివరకు 7 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ కేసు విచారణకు బ్రేక్‌లు పడ్డట్లు తెలుస్తోంది. సుమారు నెల రోజుల పాటు ఈ విచారణకు విరామం ఇవ్వనున్నట్లు సమాచారం.

కాగా వివేకా హత్య కేసులో రెండో విడత దర్యాప్తు కోసం 15 మంది సీబీఐ అధికారులు గత నెల కడప జిల్లాకు చేరుకున్నారు. విచారణలో భాగంగా పులివెందుల, కాణిపాకం, తిరుమల, కదిరి ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆ బృందంలోని ఏడుగురికి కరోనా సోకింది. వీరు ప్రస్తుతం కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక మిగిలిన వారిలో కొందరు ఢిల్లీకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో వైఎస్ వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు తాత్కాలికంగా నిలిచిపోయింది.

Read More:

‘అవును’ నటుడు హర్షవర్ధన్‌కి కరోనా పాజిటివ్‌

రియా జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు.. అప్పటివరకు జైలులోనే నటి