అందుకే ఆరు నెలల ముందుగానే నేతన్నలకు సాయం: సీఎం జగన్

'వైఎస్సార్ నేతన్న నేస్తం' కింద రెండో విడత ఆర్థిక సాయంను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అందుకే ఆరు నెలల ముందుగానే నేతన్నలకు సాయం: సీఎం జగన్
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 2:38 PM

‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ కింద రెండో విడత ఆర్థిక సాయంను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి నేతన్నకు రూ.24వేలు పంపిణీ అయ్యాయి. ఇక ఈ విడతలో మొత్తం 81,024 మందికి రూ.194.46కోట్లు జమ అయ్యాయి.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మగ్గమున్న ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పథకం పెట్టామని అన్నారు. మామూలుగా డిసెంబర్‌లో రెండో విడత సాయాన్ని ఇద్దామనుకున్నామని.. కానీ కరోనా నేపథ్యంలో ఆరు నెలల ముందుగానే సాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ సాయమందాలని ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు. ఒకవేళ అర్హత ఉండి సాయమందకపోతే 1902 ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఇక నేతన్నలకు సంబంధించి అక్టోబర్ 2 నుంచి ఈ-మార్కెటింగ్ అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు. కాగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభించిన పథకాలను చూస్తుంటే.. వాటి పేర్లు తానే మిస్‌ అవుతానేమో అనిపిస్తోందని జగన్ చమత్కరించారు. 13 నెలల్లో ఇవన్నీ చేయగలిగామంటే అది దేవుడి, ప్రజల ఆశీస్సుల వల్లేనని సీఎం పేర్కొన్నారు.

Read This Story Also: ఇక రెడీ ! చైనా వైమానిక స్థావరాల దిశగా భారత యుధ్ధ విమానాలు !