ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌లో సీటు సాధించిన జగన్‌ పెద్ద కుమార్తె

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్ష రెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్‌ స్కూల్‌లో సీటు సాధించింది

  • Tv9 Telugu
  • Publish Date - 5:25 pm, Sun, 23 August 20
ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌లో సీటు సాధించిన జగన్‌ పెద్ద కుమార్తె

Jagan Daughter Harsha Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్ష రెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్‌ స్కూల్‌లో సీటు సాధించింది. ఆ యూనివర్సిటీకి చెందిన పారిస్ క్యాంపస్‌లో హర్ష రెడ్డి మాస్టర్స్ డిగ్రీ చదవనుంది. ఈ క్రమంలో మంగళవారం హర్ష రెడ్డి పారిస్‌కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కుటుంబం బెంగళూరుకు వెళ్లి.. హర్ష రెడ్డిని పారిస్‌కి పంపనున్నారు. అయితే ఇంతకు ముందు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో హర్ష రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. హర్షకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు వచ్చిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆమెకు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

Read More:

నా హోటల్‌కి అనుమతిని ఇవ్వండి: నిత్యానందకు ప్రముఖ వ్యాపారవేత్త లేఖ

నా కుటుంబాన్ని కలవక రెండు నెలలు అవుతోంది: మంత్రి