మేళ్లచెరువులో రమణీయంగా శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర కల్యాణం

మేళ్లచెరువులోని‌ మహా సిమెంట్ పరిశ్రమలో మంగళవారం శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం రమణీయంగా జరిగింది. రామానుజ దాసులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 23 వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

మేళ్లచెరువులో రమణీయంగా శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర కల్యాణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 17, 2020 | 2:34 PM

మేళ్లచెరువులోని‌ మహా సిమెంట్ పరిశ్రమలో మంగళవారం శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం రమణీయంగా జరిగింది. రామానుజ దాసులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 23 వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కళ్యాణ మండపాన్ని బహువిధ పుష్పములతో సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మూర్తులను అధిష్టింపజేశారు. వేద బ్రాహ్మణోత్తముల వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ తంతు నయన మనోహరంగా ప్రారంభమైంది. శ్రీదేవీ భూదేవీ అమ్మవార్ల నడుమ కళ్యాణ వేంకటేశ్వరుడు చూడ ముచ్చటగా దర్శనమిచ్చారు. అంతకు ముందు అమ్మవార్లను పెళ్లికూతురిగా అలంకరింపజేసి మేళతాళాలతో మైహోం ఛైర్మన్ రామేశ్వర్ రావు, శ్రీకుమారి దంపతులు పల్లకిపై అమ్మవార్లను వేదికపైకి చేర్చారు. మంగళ స్నానం, కన్యాదానం, జీలకరబెల్లం వంటి వివాహ తంతును చినజీయర్ స్వామి వారు జరిపించారు. మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుక రమణీయంగా సాగింది‌. చిన జీయర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి అవసరమైనట్లు చెప్పారు. కరోనా పుణ్యమా అని షేక్ హేండ్ కి బదులు భారతీయ సంస్కృతిలో భాగమైన నమస్కారాన్ని అందరూ ఆచరిస్తున్నారని చమత్కరించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. కార్యక్రమానికి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి యర్రబెల్లి దయాకర్ రావు, వేనేపల్లి చందర్ రావుతో పాటు విశేష భక్త జనం తరలివచ్చి వీక్షించారు. Read This Story Also: హాలీవుడ్‌ను వెంటాడుతోన్న కరోనా.. ప్రముఖ హీరోయిన్‌కు పాజిటివ్..!

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్