షూటింగ్ కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

షూటింగ్ కోసం వెళ్లి.. తిరుగుప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు బుల్లితెర నటులు. మొయినాబాద్ మండలం అప్పారెడ్డి గూడలోని బస్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతి చెందారు. ఓ సీరియల్ చిత్రీకరణలో భాగంగా నలుగురితో కూడిన సీరియల్ బృందం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లింది. షూటింగ్ అనంతరం వీరందరూ హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యారు. అప్పారెడ్డిగూడ బస్టాప్ వద్దకు రాగానే వారి కారు ఎదురుగా వస్తోన్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది. దీంతో […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:07 am, Wed, 17 April 19
షూటింగ్ కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

షూటింగ్ కోసం వెళ్లి.. తిరుగుప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు బుల్లితెర నటులు. మొయినాబాద్ మండలం అప్పారెడ్డి గూడలోని బస్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతి చెందారు. ఓ సీరియల్ చిత్రీకరణలో భాగంగా నలుగురితో కూడిన సీరియల్ బృందం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లింది.

షూటింగ్ అనంతరం వీరందరూ హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యారు. అప్పారెడ్డిగూడ బస్టాప్ వద్దకు రాగానే వారి కారు ఎదురుగా వస్తోన్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది. దీంతో అందులో ఉన్న భార్గవి అక్కడికక్కడే మృతి చెందింది. మరో నటి అనుషా రెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. కారు డ్రైవర్ చక్రితో పాటు మరో వ్యక్తి వినయ్ కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరికి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.