సెప్టెంబర్ నుంచి ఏపీలో టూరిస్ట్‌లకు అనుమతి

కరోనా నేపథ్యంలో దాదాపు ఆరు నెలలుగా దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలు బోసిపోయిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం నుంచి అనుమతులు లభించిన

సెప్టెంబర్ నుంచి ఏపీలో టూరిస్ట్‌లకు అనుమతి
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 18, 2020 | 5:27 PM

Andhra Pradesh Tourism: కరోనా నేపథ్యంలో దాదాపు ఆరు నెలలుగా దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలు బోసిపోయిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో సెప్టెంబర్ మొదటివారం నుంచి పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతినిస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడిన ఆయన.. ఈ నెల 20న పర్యాటక రంగ నూతన పాలసీని సీఎం జగన్ ప్రారంభించనున్నారని తెలిపారు. త్వరలో సింహాచల దేవస్థానంలో ‘ప్రసాద్‌’ పథకం పనులకు జగన్‌ శంకుస్థాపన చేయనున్నారని.. కొండపల్లి ఫోర్ట్‌, బాపు మ్యూజియంలను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఇక తొట్లకొండలో బుద్ధుని మ్యూజియం, మెడిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్ఆర్‌ క్రీడా పురస్కారాలు అందజేస్తామని.. పీపీఈ పద్ధతిలో మూడు ఇంటర్నేషనల్ స్టేడియంలు ఏర్పాటు చేస్తామని  అవంతి వెల్లడించారు.

Read More:

తూత్తుకుడిలో ఎన్‌కౌంటర్‌.. రౌడీ షీటర్ మృతి

2400 ఏళ్ల నాటి ఈజిప్టు మమ్మీ.. 130 ఏళ్ల తరువాత పెట్టె నుంచి బయటకు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu