ఆందోళనకరంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం

“కరోనాతో పోరాటం చేయటంలో నాన్న ఇబ్బంది పడుతున్నారు. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేయండి” అంటూ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక అభిమానులకు సందేశమిచ్చారు. ఇలాఉండగా, తనతోపాటు, తన కుటుంబ సభ్యులకు కరోనావైరస్ సోకినట్టు రాజశేఖర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ ద్వారా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాజశేఖర్, ఆయన భార్య జీవిత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. […]

  • Venkata Narayana
  • Publish Date - 9:34 am, Thu, 22 October 20
ఆందోళనకరంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం

“కరోనాతో పోరాటం చేయటంలో నాన్న ఇబ్బంది పడుతున్నారు. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేయండి” అంటూ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక అభిమానులకు సందేశమిచ్చారు. ఇలాఉండగా, తనతోపాటు, తన కుటుంబ సభ్యులకు కరోనావైరస్ సోకినట్టు రాజశేఖర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ ద్వారా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాజశేఖర్, ఆయన భార్య జీవిత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కుమార్తెలు శివానీ, శివాత్మిక భార్య జీవిత పూర్తిగా కరోనా నుండి కోలుకున్నారు. రాజశేఖర్ మాత్రం ఇంకా కరోనా మహమ్మారి నుంచి బయటపడలేదు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కాగా, తాజాగా టీవీ9కి అందిన సమాచారం ప్రకారం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెల్లవారుజామునుంచి రాజశేఖర్ ఆరోగ్యం విషమించినప్పటికీ ఈ మధ్యాహ్నానికి కాస్త మెరుగుపడినట్టు తెలుస్తోంది.